NDL: నందికొట్కూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని పగిడ్యాల రోడ్డు ఆవరణంలో రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యాన్ని ఏపీ రైతు సంఘం బృందం వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.