అనంతపురం: ఎమ్యెల్యే కార్యాలయంలో సోమవారం ఎండోమెంట్ అధికారులతో ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ.. పాతూరులోని చెన్నకేశవ స్వామి మాన్యం భూముల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్యెల్యేతోపాటు తెలుగు మహిళా నాయకురాలు వసుంధర, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.