VZM: వంగర మండలం మడ్డువలస ప్రాజెక్టు నుంచి 4,174 క్యూసెక్కుల నీటిని సువర్ణ ముఖి నదిలోకి గురువారం ఉదయo విడుదల చేసారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు మడ్డువలస డ్యాంలోకి 4,134 క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని, దీంతో ప్రాజెక్టులో ప్రధాన రెగ్యులేటర్లోని రెండు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.