KDP: హైదరాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.