TPT: తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద గల వకుళా మాతా ఆలయం వద్ద ఆదివారం బీజేపీ నాయకులు భక్తులతో కలిసి టెంకాయలు కొట్టి తప్పు చేసిన వారిని శిక్షించాలని మొక్కుకున్నారు. తిరుమల శ్రీవారికి తల్లిగా వకుళా మాతా దేవి నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు. అటువంటి వకుళా మాతా దేవి కళ్ళుగప్పి, అపవిత్రమైన నెయ్యిని వినియోగించిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరారు.