KKD: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారిగా వివివిఎస్ లక్ష్మణరావు బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం కాకినాడలో ఆయన ఇన్ఛార్జ్ సీఈవో పాఠంశెట్టి నారాయణ మూర్తి నుండి బాధ్యతలు తీసుకున్నారు. లక్ష్మణ్రావుని ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.