కోనసీమ: ఉప్పలగుప్తం మండలం గోపవరంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మను మాల మహానాడు కార్యకర్తలు ఆదివారం దహనం చేశారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించిన ఎమ్మెల్యే కృష్ణంరాజుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు. ఈ నిరసనలో మాల మహానాడు నేతలు పాల్గొన్నారు.