GNTR: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఉమ్మడి గుంటూరు జడ్పీ ఛైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి శంకుస్థాపన చేశారు. సంగంజాగర్లమూడి గ్రామంలో నిర్మించిన బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. అనంతరం స్కూలు ప్రాంగణంలో సీసీ రోడ్ నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించరు.