అల్లురి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో సభ జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నియంత పాలకులను తరిమి కొట్టాలన్నారు.
YS Sharmila: అల్లురి జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో జరిగిన సభలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నియంత పాలకులను తరిమి కొట్టాలన్నారు. సీఎం జగన్ బీజేపీకి బానిగా మారారని ఆరోపించారు. సింహం, పులి అని చెప్పుకొనే మీరు బీజేపీ ముందు పిల్లిలా మారారని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ, తెలుగుదేశం రెండు బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. అవి మీడబ్బులే అని షర్మిల అన్నారు. ఇసుక, బాక్సైట్, లిక్కర్ మాఫియాతో సంపాదించిన డబ్బులే. కానీ, ఓటు మాత్రం ఆలోచించి వేయండి. అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులను ఎలా తరిమి కొట్టారో.. నియంత పాలకులను అలా తరిమి కొట్టాలి. ప్రజల పక్షాన నిలబడని, పాలక పక్షం, ప్రతిపక్షం మనకొద్దని షర్మిల అన్నారు.