YCP MP Gurumurthy:బన్నీ పుష్ప మూవీ (pushpa) మానియా అంత ఇంత కాదు. పుష్ప- ద రైజ్‌కు మాములు క్రేజ్ ఏర్పడలేదు. ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (david warner).. బన్నీలాగా స్టెప్పులు వేసిన వీడియోలను చూశాం. ఇప్పుడు పుష్ప-2కు సంబంధించి లుక్‌ను విడుదల చేయగా.. భారీగా రెస్పాన్స్ వస్తోంది. కామన్ పీపుల్, బన్నీ ఫ్యాన్సే కాదు.. సెలబ్రిటీలు కూడా ఫాలొ అవుతున్నారు.
తిరుపతిలో గంగమ్మ జాతర జరిగింది. జాతరకు తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి (YCP MP Gurumurthy) హాజరయ్యారు. ఎప్పటిలాగా తెల్ల చొక్క, ప్యాంట్ వేసుకుంటే.. కిక్కు ఏముంటుంది అనుకున్నాడో.. ఏమో.. పుష్ప గెటప్‌లో వచ్చాడు. అక్కడున్న వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. అలానే భక్తి చైతన్య యాత్రలో కూడా పాల్గొన్నాడు.
తమ ఎంపీ (Gurumurthy)ఇలా రావడంతో స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. తర్వాత తేరుకుని.. ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. సార్ ఒక్క.. సెల్ఫీ (selfi) అని ఎగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోకు నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
గురుమూర్తి (Gurumurthy) పుష్ప గెటప్‌లో ఉండగా ఆయన పక్కన హనుమంతుడి (lord anjaneya) వేషధారణలో మరొకరు ఉన్నారు. మిగతా అనుచరులు రంగులు పూసుకొని.. జోష్ మీద వీడియోలో కనిపించారు.
Tirupati Mp gurumurthy in #Pushpa2TheRule First Look avathar 😳🔥🔥