»Which Colour Saree You Want Plz Tell Me Lokeshroja
roja on lokesh:అవును ఆంటీనే.. ఏ కలర్ చీర కావాలో చెప్పు, లోకేశ్‌కు రోజా కౌంటర్
లోకేశ్‌కు చీర (saree), గాజులు (bangle) పంపిస్తానని రోజా అన్న సంగతి తెలిసిందే. పంపివ్వండి.. తన అక్క చెల్లెళ్లకు ఇస్తానని లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న ( బుధవారం ) రోజా ఇంటికి వెళ్లేందుకు టీడీపీ మహిళల నాయకులు చీర, సారె తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. గేటు ముందే పోలీసులు వారిని నిలువరించారు. ఈ రోజు ఏ కలర్ చీర తీసుకొని రావాలో చెప్పండి అని రోజా అన్నారు.
roja on lokesh:నారా లోకేశ్ (nara lokesh) మంత్రి రోజా (roja) మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. రోజాను లోకేశ్.. డైమండ్ పాప (diamond baby), జబర్దస్త్ ఆంటీ (jabardast anunty) అనగా.. అవును తాను ఆంటీనే అని అంగీకరించారు. తనకు ఇద్దరు పిల్లలు (two kids) ఉన్నారని వివరించారు. తన వయసుకు ఆంటీనే అంటూ కూడా కౌంటర్ ఇచ్చారు. నిన్న లోకేశ్‌ను అంకుల్ అని రోజా పిలిచిన సంగతి తెలిసిందే.
“జబర్దస్త్ ఆంటీనే. నవ్వుతూ జబర్దస్త్ ఆంటీ అని పిలవాలా? అంత వ్యంగ్యం ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా వయసుకు నేను ఆంటీనే. అందులో ఆశ్చర్యం ఏముందని?” అని రోజా (roja) ప్రశ్నించారు. లోకేశ్ (lokesh) వేసే జోకులకు జనాలు నవ్వడం లేదని, ఆ జోకులకు తానే నవ్వుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. జగన్‌ని (jagan) చూసి తాను కూడా సీఎం అవ్వాలని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడని పేర్కొన్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉందని రోజా విమర్శించారు. లోకేశ్ ఒక పొలిటికల్ జీరో (political zero) అని ప్రజలే అంటున్నారని తెలిపారు. పాదయాత్ర మొదటి నుంచి ఇప్పటివరకు గమనిస్తే ఆ విషయం లోకేశ్‌కే అర్థమవుతుందని అన్నారు. లోకేశ్ మీటింగులకు ఎక్కడా జనం రావడం లేదని రోజా కామెంట్ చేశారు. తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రజలను తీసుకువస్తున్నారని తెలిపారు.
అంతకుముందు లోకేశ్‌కు చీర (saree), గాజులు (bangle) పంపిస్తానని రోజా అన్న సంగతి తెలిసిందే. పంపివ్వండి.. తన అక్క చెల్లెళ్లకు ఇస్తానని లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. నిన్న ( బుధవారం ) రోజా ఇంటికి వెళ్లేందుకు టీడీపీ మహిళల నాయకులు చీర, సారె తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. గేటు ముందే పోలీసులు వారిని నిలువరించారు. ఈ రోజు ఏ కలర్ చీర తీసుకొని రావాలో చెప్పండి అని రోజా అన్నారు. రంగు చెబితే చీర పంపిస్తా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
లోకేశ్ ఐరన్ లెగ్ (iron leg) అని రోజా అన్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువు అయ్యిందని పేర్కొన్నారు. లోకేశ్‌కు (lokesh) పెద్దలను గౌరవించడం తెలియదని మండిపడ్డారు. తనను కామెంట్ చేసిన.. లోకేశ్‌ను అంకుల్ (uncle) అంటూ పిలిచారు. నగరిని దోచుకుంటున్నారని.. ఐదుగురికి పంచేశారని లోకేశ్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రోజా (roja) స్పందిస్తూ.. ఎవరి కుటుంబానికి ఆస్తులు (assets) ఉన్నాయో బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. రోజా- లోకేశ్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది.