ELR: బుట్టాయిగూడెం మండలంలోని గణపవరం సమీపంలో ఉన్న జల్లేరు వాగు వరద తాకిడికి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం వాహనరద్దీతో ఉండే బుట్టాయిగూడెం నుంచి జీలుగుమిల్లి వెళ్లేందుకు ఈ రహదారి గుండా ప్రయాణించాలంటే వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. వరద తాకిడికి పూర్తిగా ధ్వంసమై సుడిగుండం మారిన కల్వర్ట్పై ఆదమరిస్తే ప్రాణాపాయం తప్పదని ప్రజలు అంటున్నారు.