శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలను ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు పూలమాలవేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులకు వ్యతిరేకంగా సమ సమాజ నిర్మాణం కోసం అమరులైన విప్లవ వీర కిశోరాల స్ఫూర్తితో ఏఐవైఎఫ్ పోరాటం చేస్తుందన్నారు.