ఈరోజు నుంచి వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు… తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మత్తు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గోదావరి 4వ బ్రిడ్జ్, గామన్ బ్రిడ్జ్ మీదుగా వాహనాలను మల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఈనెల 17న రోడ్ కమ్ రైలు వంతెన మీదుగా అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడం పట్ల.. పాదయాత్రను అడ్డుకునేందుకే ఇలా చేస్తున్నారని పలువురు నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇంకోవైపు కొవ్వూరు రాజమండ్రి మధ్య గోదావరి నదిపై ఉన్న ఈ బ్రిడ్జ్…రిపేర్ చేయాలని అనేక రోజులుగా స్థానికులు కోరుతున్నారు.