undavalli arun:చంద్రబాబును (chandrababu) అనపర్తిలో పోలీసులు (police) అడ్డుకోవడం కాంట్రవర్సీకి దారితీసింది. జగన్ (jagan) ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఆ జాబితాలో సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ (arun kumar) చేరారు. ఆయన పాజిటివ్‌గానే చెప్పారు. నిన్నటి ఘటన వైసీపీకి మైనస్ అవుతుందని చెప్పారు.
undavalli arun:చంద్రబాబును (chandrababu) అనపర్తిలో పోలీసులు (police) అడ్డుకోవడం కాంట్రవర్సీకి దారితీసింది. జగన్ (jagan) ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఆ జాబితాలో సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ (arun kumar) చేరారు. ఆయన పాజిటివ్‌గానే చెప్పారు. నిన్నటి ఘటన వైసీపీకి మైనస్ అవుతుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) వరకూ పాదయాత్రలను తాను చూశానని చెప్పారు. నిన్న చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నాడు కాంగ్రెస్ పార్టీ జగన్‌ను జైలుకు పంపడం వల్ల ముఖ్యమంత్రి అయ్యారని ఉండవల్లి తెలిపారు.
చంద్రబాబు (chandrababu) సభకు ముందుగా పోలీసులు ఇచ్చారు. ఆ వెంటనే రద్దు చేశారు. సభను అడ్డుకునేందుకే ఇలా చేశారు. అయినా సరే అని చంద్రబాబు ముందుకు కదిలారు. అయితే రహదారిపై వాహనాలు అడ్డుపెట్టారు. దీంతో వారి విధానం అర్థమయ్యింది. తాను అనపర్తి వెళ్లాలని భీష్మించుకొని కూర్చొన్న చంద్రబాబు.. 6 కిలోమీటర్ల మేర క్యాండిల్ లైట్ వెలుగులో కాలినడకన చేరుకున్నారు. ఖాకీ దుస్తులతో పోలీసులే రోడ్డుపై బైఠాయించి హంగామా చేశారని టీడీపీ నేతలు అంటున్నారు.
ఆనాడు మహాత్ముడు నిర్వహించిన ‘దండి యాత్ర’ స్ఫూర్తితో… ‘అనపర్తి మార్చ్’ (anaparthy march) నిర్వహిస్తున్నా అని చంద్రబాబు అన్నారు. వేలాదిమంది కార్యకర్తలు కదిలిరాగా, ఆరు కిలోమీటర్ల మేర కదం దొక్కారు. అడ్డంకులను ఛేదించుకుని అనపర్తి దేవీచౌక్ రైల్వే స్టేషన్ రోడ్డులో (railway station road) జరిగిన సభకు వచ్చారు. అప్పటికే వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పోలీసుల వైఖరిపై చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. మైక్ దగ్గరికొస్తే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. చంద్రబాబును సభను అడ్డుకోవడం ఎందుకు అని ఉండవల్లి ప్రశ్నించారు. ఇది నెగిటివ్ అవుతుందని చెప్పారు. సీఎం జగన్ మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్న ఉండవల్లి.. కీ సజెషన్ చేశారు.