సాధారణంగా ఒక బర్రె రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది. మా అంటే మూడు నాలుగు లీటర్లు ఇస్తుంది. అయితే.. కొన్ని రకాల జాతులకు చెందిన బర్రెలు అయితే 5 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. కానీ.. ఈ బర్రెను చూడండి. ఏకంగా రోజుకు 26 లీటర్ల పాలను ఇస్తుంది. 26.59 లీటర్ల పాలను రోజూ ఇస్తూ రికార్డు క్రియేట్ చేసింది. ఏ బర్రె కూడా రోజూ అన్ని లీటర్ల పాలు ఇవ్వదు. కానీ.. ముర్రా జాతికి చెందిన ఈ బర్రె స్పెషాలిటీనే అది.
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా, మండపేటకు చెందిన ముత్యాల సత్యనారాయణ అనే పాల రైతుకు చెందిన బర్రె ఇది. ఎక్కువ పాలు ఇస్తూ ఈ బర్రె రెండు సార్లు రికార్డు క్రియేట్ చేసిందట. ఒకసారి విజయవాడ, మరోసారి మండపేటలో నిర్వహించిన స్టేట్ లేవల్ కాంపిటిషన్లో ఆ బర్రె తొలి స్థానంలో నిలిచిందట. పాలు ఇవ్వడంలోనే కాదు.. ఇప్పటి వరకు ఈ బర్రె 6 సార్లు ఈనింది. 4 మగ దూడలు, 2 ఆడ దూడలను కన్నది.
ఈ బర్రె వయసు కూడా చిన్నదే. 4 ఏళ్లే. కానీ.. తన తల్లి కంటే కూడా ఇప్పుడు ఈ బర్రె ఎక్కువ పాలు ఇస్తోందట. కాగా, దీని మేత కోసం మాత్రం రోజూ రూ.500 ఖర్చు చేస్తున్నారట. మొక్కజొన్న, తౌడు, గడ్డి తినే అన్ని పాలు ఇస్తుందట ఆ బర్రె. దాని గురించి చుట్టుపక్కన ఉన్న గ్రామాల ప్రజలకు తెలియడంతో దాన్ని చూడటానికే స్థానికులు ఎగబడుతున్నారు. స్థానికంగా ఆ బర్రె హీరో అయిపోయింది.