These are the TDP candidates for 9 Assembly and 4 Parliament seats
TDP: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోవు ఎన్నికలకు టీడీపీ కూటమి సన్నద్దం అయింది. ఇన్ని రోజులు సందిగ్దంలో ఉన్న స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరికి నిరాశ ఎదురయింది. అలాగే కదిరి నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చుకుంది టీడీపీ. మొదటి జాబితాలో అక్కడ కందికుంట యశోదకు అవకాశం ఇచ్చారు. తాజాగా అక్కడ అభ్యర్థిని మార్చి తన భర్త కందికుంట వెంకటప్రసాద్‌కు అవకాశం ఇచ్చారు.