»Then Balakrishna Now Chandrababu He Is The One Who Arrested Both Of Them
AP CID Chief Sanjay: అప్పుడు బాలకృష్ణ, ఇప్పుడు చంద్రబాబు..ఇద్దర్నీ అరెస్ట్ చేసింది ఆయనే
ప్రభుత్వ అధికారులకు పెద్ద స్థాయి వ్యక్తులతో చేయడం అనేది పెద్ద సవాల్ లాంటిది. కానీ ఓ అధికారి మాత్రం ఎవ్వరికీ భయపడలేదు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించి అందరి చేత హౌరా అనిపించుకుంటున్నాడు. అటు బాలకృష్ణను, ఇటు చంద్రబాబును ఇద్దర్నీ అరెస్ట్ చేసి తాను సాధారణ ఆఫీసర్ కాదంటూ నిరూపించుకున్నారు.
ఏపీలో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement scam case)లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైఎస్సార్ హయాంలోనే బాబును ఎవ్వరూ టచ్ కూడా చేయలేదు. తనపై 27 కేసులు పెట్టిన ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారని చంద్రబాబే స్వయంగా చాలాసార్లు చెప్పారు. అలాంటి ఆయన్ని ఓ సీఐడీ అధికారి అరెస్ట్ చేశారు. తన వాదనలను బలంగా వినిపించి చంద్రబాబును రిమాండ్‌కు వెళ్లేలా చేశారు. ఆయనే సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్.
2004లో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు అప్పట్లో బాలకృష్ణ (Balakrishna)ను కూడా అరెస్ట్ చేసింది ఈ ఆఫీసరే. ఇది యాదృచ్ఛికమేనని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ 2004లో హైదరాబాద్‌లో కొంతమందిపై రివాల్వర్‌తో దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో సంజయ్ బాలకృష్ణను అరెస్ట్ చేసి కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. అప్పట్లో హైదరాబాద్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా సంజయ్ (N.sanjay) ఉండేవారు.
అప్పట్లో బాలకృష్ణను ఇప్పుడు బాబును అరెస్ట్ చేయడంతో సంజయ్ (AP CID Chief Sanjay) పేరు బలంగా వినిపిస్తోంది. సంజయ్.. 1996 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ క్రై మ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు రూ.371 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని సంజయ్ బలంగా తన వాదనలు వినిపించి హాట్ టాపిక్ అయ్యారు.