»Prisoner Number 7691 Chandrababu In Rajahmundry Jail
Chandrababu: ఖైదీ నంబర్ 7691.. రాజమండ్రి జైలులో చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా టీడీపీ బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ను పోలీసులు అమలు చేస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill Development scam) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 22వ తేది వరకు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీసులు భారీ భద్రతతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు (Rajahmundry central jail) తీసుకెళ్లారు.
కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు (Chandrababu) కోసం జైలు అధికారులు స్నేహ బ్లాక్ (Sneha block)లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ 7691ను కేటాయించారు. జైలు దగ్గర 300 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసి నిఘా ఉంచారు.
మరోవైపు చంద్రబాబు(Chandrababu)కు ఇంటి భోజనంతోపాటు మందులు (Medicines) ఇవ్వడానికి కోర్టు అనుమతులను ఇచ్చింది. భద్రతా కారణాల వల్ల మిగతా ఖైదీలతో కాకుండా ప్రత్యేక గదిలో ఉండేట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే బాబుకు బెయిల్ కోసం ఆయన లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి తర్వాత హైకోర్టులో కూడా లంచ్మోషన్ పిటిషన్ వేశారు.
బాబును విచారణ నిమిత్తం జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand)కు అప్పగించాలని సీఐడీ కోర్టు (CID Court)లో పిటిషన్ దాఖలు చేయడంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ బంద్ (Bandh)కు పిలుపునిచ్చింది. నేడు ఏపీలో పోలీసులు 144 సెక్షన్ (144 Section) విధించారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని ప్రకటించారు.