RS.200 Crores జగన్ ఫోటో పెడితే.. సీఎం పిక్ తీసకుంటా:వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్
Ycp Mla Arthur:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు సంబంధించి మరో ఎమ్మెల్యే (mla) ముందుకు వచ్చారు. నంద్యాల (nandyala) జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (Ycp Mla Arthur) తనకు టీడీపీ (tdp) ఆఫర్ చేసిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేస్తే కోట్లు ఇస్తామని చెప్పారని వివరించారు.
Ycp Mla Arthur:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు సంబంధించి మరో ఎమ్మెల్యే (mla) ముందుకు వచ్చారు. నంద్యాల (nandyala) జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ (Ycp Mla Arthur) తనకు టీడీపీ (tdp) ఆఫర్ చేసిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేస్తే కోట్లు ఇస్తామని చెప్పారని వివరించారు. భారీగా డబ్బు ఇస్తానని చెప్పారని.. తిరస్కరించానని తెలిపారు.
తొలుత తన కుమారుడికి (son) ఫోన్ చేశారని ఆర్థర్ వివరించారు. నాన్న (father) ఒప్పుకోరని తన కుమారుడు వారికి చెప్పారని వివరించారు. పోలింగ్ ముందురోజు రాత్రి తాడేపల్లిలో (tadepally) గల ఇంటి వద్ద కలువాలని ప్రయత్నించారని ఆర్థర్ (arthur) చెప్పారు. వ్యక్తిగతంగా మాట్లాడాలని గన్‌మెన్‌ను కొందరు సంప్రదించారని వివరించారు.
తన గన్ మెన్ ఫోన్లో మాట్లాడితే కర్నూల్ త్రీ టౌన్ సీఐ వద్ద ఉందని.. పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పారని తెలిపారు. ఓటు వేసే ముందు కూడా ఫోన్ (call) చేశారని తెలిపారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి (silpa chakrapani) ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడానని చెప్పారు. పర్సనల్‌గా మాట్లాడాలి అని చెబితే వారిని హెచ్చరించానని పేర్కొన్నారు. తన ముందు రూ.200 కోట్లు (rs.200 crores).. జగన్ (jagan) ఫోటో పెడితే.. జగన్ ఫోటోనే తీసుకుంటానని చెప్పారు. డబ్బుల కోసం ఆశపడే వ్యక్తిని కాదని చెప్పారు. జగన్‌తో తన ప్రయాణం కొనసాగుతోందని చెప్పారు.
ఇప్పటికే వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (rapaka vara prasad) టీడీపీ తనకు రూ.10 కోట్ల ఆఫర్ చేసిందని ఆరోపించారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మద్దాలి గిరి (maddali giri) కూడా టీడీపీ నేతలు తనను సంప్రదించారని వివరించారు. ఇప్పుడు ఆర్థర్ ముందుకు వచ్చారు. ఇంక ఎంతమందిని టీడీపీ సంప్రదించిందో అనే సందేహం సహాజంగానే వస్తోంది. రోజుకో ఎమ్మెల్యే బయటకు రావడంతో సహాజంగానే డౌట్ వస్తోంది.