AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీ వీడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో వికెట్ పడింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైసీపీకి గుడ్ బై చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ వీడి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ వైఎస్ షర్మిల సమక్షంలో ఎంఎస్ బాబు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఎస్ బాబును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మొదటి సారి వైసీపీ పార్టీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యనాలు చేశారు. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు వైసీపీని వదిలి వెళ్లిపోతుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు కొందరికి టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ కారణంగానే వారు పార్టీని వీడి ఇతర పార్టీలపై పోటీ చేయడానికి సిద్దపడ్డారు.