AP Politics: రాఘరామకృష్ణం రాజుకు చంద్రబాబు టికెట్ ఖారారు చేశారు. ఉండి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఆర్ఆర్ఆర్ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు టికెట్ ఇవ్వడంపై ఉండి నియేజకవర్గంలో గందరగోళం నెలకొంది. కొద్ది రోజుల క్రితం అక్కడ రామరాజుకు టికెట్ ఇచ్చారు. ఆయన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే. తాజా పరిణామంతో రామరాజు టికెట్ క్యాన్సెల్ చేసి ఆ స్థానంలో ఆర్ఆర్ఆర్కు కేటాయించడంతో ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభస్థానం నుంచి గెలుపొందిన రఘురామకృష్ణం రాజు తన పార్టీపై, ముఖ్యనేతలపై ఆరోపణలు చేయడం, ఆయన జైలుకు వెళ్లడం, ఆ తరువాత జరిగిన పరిణామాలు అన్ని తెలిసిందే. ఇక 2024 ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున టికెట్ ఆశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడిన తరువాత కూడా బీజేపీ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు సాగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిన మరుసటి రోజే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం.. అదికూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇచ్చిన టికెట్‌ను క్యాన్సెల్ చేసి రాఘురామ రాజుకు ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.