Kodikatti case: కోడికత్తి కేసులో శ్రీనుకు బెయిల్ మంజూరు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై గతంలో దాడి జరిగిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీను గత ఐదేళ్లుగా జైల్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా కోడికత్తి కేసులో శ్రీనుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది.
Kodikatti case: ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. కోడికత్తితో శ్రీనివాస్ అనే యువకుడు జగన్‌ను గాయపరిచాడు. ఈ కేసులో జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీను గత ఐదేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. ఈ కేసులో తాజాగా శ్రీనుకు ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తనకు బెయిల్ కావాలంటూ శ్రీనివాస్ హైకోర్టుకు పిటిషన్ పెట్టుకున్నారు. దానిపై ఈరోజు విచారణ జరిగింది. శ్రీను బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టి, ఈరోజు తీర్పును వెలువరించింది.
గత ఐదేళ్ల కాలంలో సాక్షం చెప్పేందుకు సీఎం జగన్ ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరు కాలేదు. దాంతో శ్రీనుకు ఏ రకమైన తీర్పు రాలేదు. ఈ రోజు శ్రీనుకు హైకోర్టు పలు షరతులు విధించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని, వారానికి ఒక రోజు ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇన్నాళ్లుగా శ్రీనుకు న్యాయం చేయండి అని గొంతెత్తిన దళిత, పౌరహక్కు సంఘాలు హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.