తిరుమల(Tirumala)లో వేడుకగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు(Salakatla Teppotsavam) జరుగుతున్నాయి. శనివారం ఈ తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా, కనుల పండువగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ స్వామి(Rukmini Sri Krishna Swamy) తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ తెప్పోత్సవాల(Teppotsavam) సందర్భంగా తిరుమల(Tirumala)కు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. స్వామి దర్శనం కోసం క్యూ లైన్లలో అధిక సంఖ్యలో వేచి ఉన్నారు.

తెప్పోత్సవం(Teppotsavam)లో భాగంగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ మాఢవీధుల్లో మొదట ఊరేగించారు. ఆ తర్వాత పుష్కరిణి వద్దకు స్వామి, అమ్మవార్లను తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి ఆశీనులయ్యారు. పుష్కరిణిలో మూడు చుట్లూ తిరుగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల(Tirumala)లో వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవాన్ని(Teppotsavam) టీటీడీ(TTD) అధికారులు వేడుకగా నిర్వహించారు. ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెప్పపై శ్రీవారిని చూసి పులకించిపోయారు. ఉత్సవాల్లో మూడో రోజు అయిన ఆదివారం మలయప్పస్వామి తిరుచ్చిపై స్వర్వాలంకార భూషితుడై శ్రీవారు పుర వీధుల్లో ఊరేగనున్నారు. ఆ తర్వాత కోనేటిలోని తెప్పపై మూడు సార్లు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.