TTD: టీటీడీకి షాక్ ఇచ్చిన చాగంటి కోటేశ్వరరావు..ఆ పదవి తిరస్కరణ
ఏపీ సర్కార్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara rao) టీటీడీ(TTD)కి షాక్ ఇచ్చారు. చాగంటి కోటేశ్వరరావును వరించిన టీటీడీ(TTD) సలహాదారు పదవిని ఆయన తిరస్కరించాడు. టీటీడీ(TTD) ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్లు ఈ మధ్యనే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

టీటీడీ(TTD)లో పారాయణం కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా ఈ నియామకాన్ని చేపట్టినట్లు టీటీడీ(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే ఆ పదవిని చేపట్టేందుకు చాగంటి కోటేశ్వరరావు విముఖత చూపించారు. ముక్కుసూటిగా మాట్లాడే చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara rao) ఈ విషయంలో కూడా తన మనసులోని మాటను నిర్మోహమాటంగా చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానాని(TTD)కి సలహాలు ఇవ్వడానికే అయితే తనకు ఆ పదవులు అవసరం లేదని చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara rao) అన్నారు. టీటీడీ(TTD)కి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా తాను సహకరించేందుకు ముందుంటానని తెలిపారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి తన ఊపిరి అని, ఆయన నామ స్మరణ తనకు ఊపిరి అని తెలిపారు. ఇటీవలె చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara rao) సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం చాగంటి టీటీడీ(TTD) ఇస్తున్న పదవిని తిరస్కరించడం చర్చనీయాంశమైంది.