టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit sharma) కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. వెస్టిండీస్‌తో టెస్ట్, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఆయన భారత్‌కు తిరిగొచ్చారు. నేటి ఉదయం కుటుంబ సమేతంగా ఆయన తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరాలతో కలిసి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకన్న రోహిత్ శర్మ కుటుంబం:
ప్రస్తుతం రోహిత్ శర్మ (Rohit sharma) శ్రీవారిని దర్శించుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతున్నాయి. స్వామివారి ఆలయంలో రోహిత్ శర్మ కుటుంబానికి ఆలయ అధికారులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆయన వేదాశీర్వచనాలతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను టీటీడీ (TTD) అధికారులు అందించారు. రోహిత్ శర్మతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.