PV Ramesh Resign: ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కాక రేపుతోంది. మాజీ సీఎం చంద్రబాబు జైలులో ఉన్నారు. ఇంతలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేఘా ఇంజినీరింగ్ సంస్థ బాధ్యతల నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ (PV Ramesh) తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి అందజేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ తీరుపై పీవీ రమేశ్ (PV Ramesh) అనుమానాలు లేవనెత్తారు. తన స్టేట్ మెంట్ ఆధారంగా కేసు పెట్టామని సీఐడీ అధికారులు చెబుతున్నారు.. అదీ ముమ్మాటికీ తప్పు అన్నారు. తాను ఇచ్చిన వాంగ్మూలతంతో చంద్రబాబు అరెస్ట్ కాలేదని పేర్కొన్నారు. అఫ్రూవర్‌గా మారారని అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫైలు లేకుండా కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్లో ఆర్థిక శాఖ ఏ తప్పు చేయలేదని.. సీఐడీ తీరుపై అనుమానం వ్యక్తం చేశారు.
చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పీవీ రమేశ్ (PV Ramesh) పని చేశారు. ఈ కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ అదేం లేదని ఆయన స్పష్టంచేశారు. అలా చెప్పారో లేదో.. మేఘా నుంచి వైదొలిగారు. మేఘా సంస్థ పీవీని రాజీనామా చేయాలని కోరారని సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తనను రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని పీవీ రమేశ్ స్పష్టంచేశారు. ఉన్నట్టుండి మేఘా నుంచి పీవీ రమేశ్ (PV Ramesh) తప్పుకోవడం వెనక బలమైన కారణం ఉండి ఉంటుంది.