Pawan kalyan: టీడీపీకి దూరంగా జనసేన..? కారణం ఇదే..?
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒంటరిగా బరిలోకి దిగుతారనే సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల ఆయన మాట తీరు, వైఖరి మారడంతో రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) వారాహి యాత్రతో దూసుకెళ్తున్నారు. అతని యాటిట్యూడ్ మారింది. ప్రసంగం తీరు, వ్యవహార శైలి ఛేంజ్ అయ్యింది. ఇందుకు కారణం యాత్రకు వస్తోన్న స్పందనే.. మరీ.. ఆయన టీడీపీతో పొత్తు కొనసాగిస్తారా..? అనే సందేహాలు వస్తున్నాయి. వారాహి యాత్రతో వెళ్తున్న పవన్ కల్యాణ్‌కు విశ్వాసం పెరిగినట్టు ఉంది. అందుకే ఒంటరిగా బరిలోకి దిగాలని ఆయన అనుకుంటున్నారని తెలుస్తోంది.
ఒంటరిగా బరిలోకి దిగితేనే మేలు అని పవన్ (Pawan) భావిస్తున్నారట. ఒకవేళ తమ పార్టీ కనీసం 30 సీట్లు గెలిస్తే.. పరిస్థితి మరోలా ఉంటుందని అంచనా వేస్తున్నారట. అప్పుడు కింగ్ మేకర్ అవుతానని పవన్ లెక్క. పీఠాపురం సభలో మాట్లాడిన తీరును బట్టి అర్థం అవుతోంది. అక్కడ రాజకీయాలే కాదు.. స్థానిక సమస్యలను కూడా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 100 మందిని బరిలోకి దింపుతుందని.. దీంతో కనీసం 30 సీట్లు సాధిస్తామని పవన్ (Pawan) అనుకుంటున్నారు.
గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడే తమ పార్టీకి ఓటు శాతం ఎక్కువగా ఉందని.. మెజార్టీ స్థానాలు గెలుస్తామని పవన్ అంటున్నారు. ఇక్కడ కనీసం 25 సీట్లు గెలిచిన.. మరో పది సీట్లు రాష్ట్రంలోని ఇతర చోట్ల గెలుస్తామని ధీమాతో ఉన్నారు. దీంతో గతంలో కంటే తమ పార్టీ బలంగా మారుతుందని ఆయన భావిస్తున్నారు. తమ పార్టీ 2029 వరకు బలపడుతోందని సీనియర్ నేత హరిరామ జోగయ్య చెప్పడాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఏపీలో మెజార్టీ ఓటు బ్యాంక్ వైసీపీ, టీడీపీకే ఉంటాయి. వాటిని జనసేన కొల్లగొట్టడం కాస్త కష్టమే. రాయలసీమలో జనసేనకు ఆదరణ తక్కువే అనేవారు కూడా ఉన్నారు. ఓటర్ల సెంటిమెంట్, స్థానిక ఇష్యూస్, రాజకీయ పొత్తుల ఆధారంగా ఓట్లు కొల్లగొట్టొచ్చు.