Video: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు వచ్చే నెల 2వ తేదీన.. పవన్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంబరాల్లో ఉన్నారు. ఒక్కొక్కరు ఒకలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబుకు పవన్ (pawan) అంటే అమితామైన అభిమానం. ఆయనపై ఇష్టంతో వెండి కళాకృతిని రూపొందించారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే సందర్భంగా వెండితో కళాకృతి రూపొందించారు. 470 కిలోల వెండి వినియోగించి కళాకృతిని తీర్చిదిద్దారు. పెద్ద బ్లాక్ కలర్ బ్లాక్ గ్రౌండ్ తీసుకొని.. దాని మీద వెండి గొలుసులు పెట్టారు. పవన్ కళ్లు, మీసాలు, పళ్లు కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మేకింగ్ వీడియోను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ విడుదల చేశారు.
ఆ వీడియో చూస్తే ముచ్చట వేస్తోంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీద అభిమానంతో కళాకృతి తయారు చేశారు. ఇందుకోసం రూ.40 లక్షల వరకు ఖర్చు చేశారు. కూలీల పనితో కలిపితే అదీ రూ.45 లక్షల వరకు అవుతుంది. తమ అభిమాన నటుడు, రాజకీయ నేతకు డిఫరెంట్గా శుభాకాంక్షలను తెలియజేశారు. మేకింగ్ వీడియో రిలీజ్ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు, సుందర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.