• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి

సత్యసాయి: హిందూపురం నియోజకవర్గంలోని సడ్లపల్లిలో శ్రీ సూగూరు సీతారామాంజనేయ స్వామి నూతన విగ్రహవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పాల్గొని పూజలు నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు.

February 20, 2026 / 03:00 PM IST

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

KDP: బద్వేల్‌లోని పేదలు, కూలీలు నిత్యం ప్రయాణించే వారి ఆకలి తీర్చడమే ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుత పథకం ‘అన్న క్యాంటీన్’ అని అన్నారు. అతి తక్కువ ధరకే, అత్యంత నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని గౌరవప్రదమైన రీతిలో అందిస్తూ వేలాది మంది కడుపు నింపుతోందని మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పేర్కొన్నారు. శుభ్రత, నాణ్యత, ధరలను తనిఖీ చేశారు.

February 20, 2026 / 02:59 PM IST

‘మత, లింగ వివక్షతను నిర్మూలించడానికి కృషి చేయాలి’

KRNL: అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఆస్పరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి మాట్లాడుతూ.. సామాజిక, ఆర్ధిక, రాజకీయ అసమానతలను తీర్చడానికి, కుల, మత, లింగ వివక్షతను నిర్మూలించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.

February 20, 2026 / 02:59 PM IST

ప్యాపిలిలో తాగునీటి సమస్యకు కృషి చేసిన ఎమ్మెల్యే

NDL: ప్యాపిలి మండలంలోని వంకామేటుపల్లి గుట్టల పల్లెలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులను వెంటనే అప్రమత్తం చేశారు. రెండు గ్రామాల్లో బోర్లు వేసి కొళాయి కనెక్షన్ ఇచ్చి పరిష్కారం చూపారు. ఈ క్రమంలో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

February 20, 2026 / 02:57 PM IST

దివ్యాంగుల గ్రీవెన్స్ కార్యక్రమానికి 13 దరఖాస్తులు

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి 13 దరఖాస్తులు వచ్చాయి. అర్జీలు పరిష్కారంలో జాప్యం జరగకూడదని డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వికలాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని 8 మంది దరఖాస్తులు సమర్పించారు. బ్యాటరీ మోటార్ సైకిల్లు మంజూరు చేయాలని ఇద్దరు దరఖాస్తు చేశారని తెలిపారు.

February 20, 2026 / 02:54 PM IST

ఓ మీడియాపై పరువు నష్టం దావా

VSP: ప్రచురిత కథనం తమ ప్రతిష్ఠకు భంగం కలిగించిందంటూ దాఖలైన పరువు నష్టం కేసులో ఓ దిన‌ప‌త్రిక‌పై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఐటీడీపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి చింత‌కాయ‌ల విజ‌య్ విశాఖ జిల్లా కోర్టుకు శుక్ర‌వారం హాజరయ్యారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తప్పుడు కథనాలు ప్రచురించారని ఆరోపించారు.

February 20, 2026 / 02:53 PM IST

సీఎంకు ఘన స్వాగతం పలికిన ఎంపీ

NTR: ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం చంద్రబాబును ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఎంపీ కేసీనేని చిన్ని శుక్రవారం ఘనస్వాగతం పలికారు. దేశంలో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి అవకాశాలపై నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో పాల్గొనడం రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని ఎంపీ తెలిపారు.

February 20, 2026 / 02:52 PM IST

‘జగన్ టీం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి’

VZM: వైసీపీ సభ్యులు శాసనమండలిలో వెంకటేశ్వరుని ఫోటోలు తీసుకువచ్చి సభ్య సమాజం తలదించుకునేలా చేసారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా TDP కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ అండ్ టీం బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, గౌరవ సభలో వైసీపీ సభ్యుల ప్రవర్తన తీరును మార్చుకోవాలని సూచించారు.

February 20, 2026 / 02:52 PM IST

స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కుటుంబం

KRNL: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, ఆయన సతీమణి బుసినే రామాంజినమ్మతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠం మల్లికార్జున చౌదరి కుటుంబ సభ్యులు, నూతన వధూవరులు హాజరయ్యారు. అనంతరం వారికి అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:51 PM IST

రేపు ప్రొద్దుటూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

KDP: రేపు ఉదయం 10:30 గంటలకు ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సమావేశపు అజెండాను కౌన్సిలర్లు, సభ్యులకు పంపామన్నారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.

February 20, 2026 / 02:49 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా’

E.G: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని రూడా ఛైర్మన్, జిల్లా TDP అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం కోరుకొండ మండలం బూరుగుపూడిలో పలు సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి సమస్యను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామన్నారు.

February 20, 2026 / 02:48 PM IST

‘ఈనెల 28లోగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి’

ASR: పట్టాదారు పాసుపుస్తకాలు, పోడు పట్టాలు ఉన్న ప్రతిరైతూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని కొయ్యూరు మండల వ్యవసాయ అధికారి పీ. శివరామ్ ప్రసాద్ సూచించారు. డౌనూరు పంచాయతీలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ శుక్రవారం పరిశీలించారు. సిబ్బందితో కలిసి పలువురు రైతులకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈనెల 28లోగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని సూచించారు.

February 20, 2026 / 02:47 PM IST

శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న TG సీపీ సజ్జనార్

అన్నమయ్య: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ దంపతులు శుక్రవారం రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పురోహితులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ మనోజ్ కుమార్, ఈఓ రమణారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:44 PM IST

‘అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి’

NDL: అందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని డిప్యూటీ ఎంపీడీవోలు మల్లికార్జున పరమేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బేతంచెర్లలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లకు స్వర్ణ పంచాయతీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం పంచాయతీ పరిధిలో 100% ఇంటి పన్నుల వసూలు, ఆదాయం మార్గాల అభివృద్ధిపై అవగాహన కల్పించారు.

February 20, 2026 / 02:42 PM IST

పొన్నూరులో కంపోస్ట్ పనులను పరిశీలించిన కమిషనర్

GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శుక్రవారం పట్టణంలోని కంపోస్ట్ యార్డును సందర్శించి వ్యర్థాల నిర్వహణ పనులను పర్యవేక్షించారు. సేంద్రియ ఎరువు (వర్మి కంపోస్ట్) తయారీలో జాప్యం చేయకుండా నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం MRF సెంటర్‌లో పొడి వ్యర్థాల వర్గీకరణ తీరును తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

February 20, 2026 / 02:40 PM IST