• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కార్పొరేట్ బడ్జెట్‌కు వ్యతిరేకంగా 23న ధర్నా

KRNL: రాష్ట్ర బడ్జెట్ రైతులకు ఉపయోగపడకుండా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆల్ ఇండియా కిసాన్ సభ (AIKS) మరియు కౌలు రైతు సంఘం విమర్శించాయి. ఈనెల 23వ తేదీ సోమవారం ఆదోనిలో ఎమ్మార్వో (2) కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. 2026–27 బడ్జెట్‌లో వ్యవసాయానికి తగిన నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

February 21, 2026 / 07:31 PM IST

కేంద్ర పథకాల నిధులను వంద శాతం వినియోగించాలి: కలెక్టర్

W.G: భీమవరం కలెక్టరేట్లో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు జరిగిన ఖర్చు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిధులను నిర్దేశిత గడువులోగా నూరు శాతం ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 07:31 PM IST

గంజాయ అక్రమ రవాణా చట్టరీత్యా నేరం

PPM: గంజాయి, మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్య నేరమని సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. శనివారం సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో డ్రైవర్లకు, కండక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. బస్సులలో అనుమానాస్పద వ్యక్తులు కనపడినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, డిపో మేనేజర్ పాల్గొన్నారు.

February 21, 2026 / 07:31 PM IST

131 మందికి ఉచితంగా దంత వైద్య పరీక్షలు

KDP: సిద్ధవటం మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్ లో 131 మంది పోలీసు సిబ్బందికి ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు బెటాలియన్ కమాండ్మెంట్ K.ఆనంద రెడ్డి తెలిపారు. బెటాలియన్ ఆవరణలోని కళ్యాణ మండపంలో శనివారం కడప నగరానికి చెందిన హరిప్రియ డెంటల్ హాస్పిటల్ వైద్యులు దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

February 21, 2026 / 07:30 PM IST

ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ లేదు: ఎమ్మెల్యే

PLD: మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే పుల్లారావు శనివారం సమీక్ష నిర్వహించారు. పట్టణాభివృద్ధి, ప్రజా సమస్యలపై దిశానిర్దేశం చేశారు. వేసవిలోపు తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఉగాది నాటికి టిడ్కో ఇళ్ల పనులు పూర్తిచేయాలి. పారిశుధ్యం మెరుగుపరచాలి. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వేగవంతం చేయాలి. ఖాళీ స్థలాలపై పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలన్నారు.

February 21, 2026 / 07:28 PM IST

గోవా గవర్నర్‌ను కలిసిన జిల్లా కలెక్టర్

VZM: గోవా రాష్ట్ర గవర్నర్, మాన్సాస్ చైర్‌పర్సన్, గౌరవ పూసపాటి అశోక్ గజపతి రాజును, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో శనివారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు జిల్లాకు సంబందించిన పలు అంశాలపై చర్చించారు.

February 21, 2026 / 07:26 PM IST

సుమారు 50 ఎకరాల పంట మంటలకు దగ్ధం

SKLM: బూర్జ మండలం ఓపివాడ వెంకంపేట గ్రామంలో శనివారం టేకు చెట్లు, మామిడి తోటలు, వరికుప్పలు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసిందని గ్రామస్తులు తెలిపారు. సుమారు 50 ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. సంబంధిత రైతులను ప్రభుత్వం వారు ఆదుకోవాలని వారు కోరుతున్నారు. బాధితులు లబోదిబోమంటున్నారు.

February 21, 2026 / 07:26 PM IST

రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి: CPM

GNTR: పేదల భూములను కాజేసేందుకు కుట్ర చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని CPM మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. శనివారం పెదకాకానిలో CPM ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో శివాజీ మాట్లాడుతూ.. పేదల నివాస భూములను పెద్దలకు అప్పగించే కుట్రపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

February 21, 2026 / 07:24 PM IST

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. 104 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 75,72,911 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక పెద్ద అండగా నిలుస్తోందని తెలిపారు.

February 21, 2026 / 07:22 PM IST

16 మండలాల్లో స్వచ్ఛ రథాల ప్రారంభం

ATP: బుక్కరాయసముద్రంలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా 16 మండలాల్లో స్వచ్ఛ రథాలను జిల్లా పరిషత్ సీఈవో శివ శంకర్, DPO నాగరాజ నాయుడు ప్రారంభించారు. గ్రామాల్లో పొడి చెత్త సేకరించి, దానికి బదులుగా నిత్యావసర సరుకులు అందజేసే వస్తు మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు.

February 21, 2026 / 07:22 PM IST

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే

TPT: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి వార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి చికిత్స, మందుల సరఫరాపై ఆరా తీశారు. అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

February 21, 2026 / 07:20 PM IST

మంచినీటి అవస్థలు.. రోడ్డెక్కిన మహిళలు

NLR: ఉలవపాడు మండలం కరేడు పంచాయితీలోని రామకృష్ణాపురం గిరిజన కాలనీ మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన గళం వినిపించారు. 10 రోజులుగా మంచినీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. BPCL కంపెని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరేడు నుంచి రామకృష్ణాపురానికి వచ్చే మంచినీటి పైప్ లైన్ ధ్వంసం అయిందని ఆరోపించారు.

February 21, 2026 / 07:20 PM IST

అరకు ఆసుపత్రిలో పారిశుధ్యంపై దొన్ను దొర ‘అరా’

ASR: స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్రలో భాగంగా అరకు ప్రభుత్వ ఆసుపత్రిని RTC జోన్ ఛైర్మన్ దొన్ను దొర శనివారం తనిఖీ చేశారు. వార్డులన్నీ కలియ తిరిగి పారిశుధ్యం, వైద్య సేవలు, మందుల సరఫరాపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు

February 21, 2026 / 07:20 PM IST

కోమరోలులో రేపు పవర్ కట్

ప్రకాశం: కొమరోలు మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మతుల కారణంగా తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి,గుండ్రెడ్డిపల్లి, దద్దవాడ, అలసందలపల్లి, నారాయణ పల్లి, వెంకటంపల్లి గ్రామాలకు ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

February 21, 2026 / 07:09 PM IST

ఆధునీకరణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

AKP: గొలుగొండ మండల పరిషత్ కార్యాలయ ఆధునీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సుందరంగా ముస్తాబిస్తున్న కార్యాలయం ఉగాది నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీడీవో యువి.ఎస్. శ్రీనివాసరావు ఆధునీకరణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా చెప్పారు.

February 21, 2026 / 07:05 PM IST