• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మండలానికి రెండు గర్భిణుల సంరక్షణ కేంద్రాలు

ASR: కొయ్యూరు మండలానికి రెండు గర్భిణుల సంరక్షణ కేంద్రాలు మంజూరయ్యాయని ట్రైబల్ వెల్ఫేర్ జేఈ శ్రీవిద్య తెలిపారు. యూ. చీడిపాలెం, కంఠారం పీహెచ్‌సీలకు రెండు గర్భిణుల సంరక్షణ కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే యూ.చీడిపాలెం పీహెచ్‌సీలో భవన నిర్మాణానికి మార్కింగ్ పూర్తి చేశామని పేర్కొన్నారు. సంరక్షణ కేంద్రాల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.

December 15, 2024 / 06:21 AM IST

ఎన్నికలు ప్రశాంతం.. ధన్యవాదాలు తెలిపిన ఎన్నికల అధికారి

NDL: బేతంచెర్ల మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో శనివారం జరిగిన సాగునీటి సంగం ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో రైతులు, అధికారులు, పోలీసులకు ఎన్నికల అధికారి ఫజుల్ రహిమాన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సాగునీటి సంఘం చైర్మన్ లింగాల పద్మనాభుడు, వైస్ చైర్మన్ పెద్ది సావిత్రిలకు డిక్లరేషన్ ఫారం అందజేసి అభినందనలు తెలిపారు.

December 15, 2024 / 06:18 AM IST

బైక్ రైడింగ్ యువకులకు ఎస్పీ కౌన్సెలింగ్

సత్యసాయి: పెనుకొండ పట్టణంలో బాబయ్య స్వామి ఉరుసు సందర్భంగా బైక్ రైడింగ్ యువకులకు జిల్లా ఎస్పీ కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం సాయంత్రం హైవేలో రైడింగ్ చేస్తున్న 30 మంది యువకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. రైడింగ్ చేయడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా జిల్లా ఎస్పీ రత్న యువకులకు కౌన్సెలింగ్ చేపట్టారు.

December 15, 2024 / 06:14 AM IST

అవి పదవులు కాదు.. బాధ్యతలు: పరిటాల సునీత

ATP: రాప్తాడు నియోజకవర్గంలో 27 చెరువులు, 5 సాగునీటి వినియోగదారుల సంఘాలు మొత్తం 32 సాగునీటి సంఘాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవం కావడంపై MLA పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. తాజాగా ఎన్నికైన మెంబర్లు తమకు వచ్చినవి పదవులుగా భావించవద్దని అవి బాధ్యతలన్నది మర్చిపోవద్దు అని తెలిపారు.

December 15, 2024 / 06:13 AM IST

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ధర్మవరం బాలికలు

సత్యసాయి: శ్రీ వివేకానంద స్పోర్ట్స్ సొసైటీ, ఆర్‌డీటీ సహకారంతో ధర్మవరం క్రీడాకారులు నవ్య, ఉష శనివారం గుంతకల్లు రైల్వే క్రీడామైదానంలో జరిగిన జిల్లా స్థాయి జూనియర్స్ కబడ్డీ పోటీలలో రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపికయ్యారు. డిసెంబర్ 22-25 మధ్య ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

December 15, 2024 / 06:12 AM IST

ఎమ్మెల్యే శ్రావణిని కలిసిన సాగునీటి సంఘం సభ్యులు

ATP: బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు సాగునీటి సంఘం అధ్యక్షులు రాచమల్లు సోమశేఖర్, ఉపాధ్యక్షులు బుసగాని ఆదినారాయణ, డైరెక్టర్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురంలోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

December 15, 2024 / 06:04 AM IST

BSF జవాన్‌గా ఎంపికైన సిక్కోలు యువతి

SKLM: పొందురు మండలం పిల్లలవలస గ్రామానికి చెందిన గురుగుబెల్లి హేమలత శనివారం విడుదలైన ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో BSF జవాన్‌గా  ఎంపికయ్యారు. డిగ్రీ శ్రీకాకుళంలో ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశారు. తండ్రి గురుగుబెల్లి శ్రీరామమూర్తి, తన భర్త బూర్జ సూరపు చంద్రశేఖర్, ట్రైనింగ్ కోచ్ తేజ ప్రోత్సాహంతో ఈ ఉద్యోగం సాధించినట్లు ఆమె తెలిపారు.

December 15, 2024 / 06:02 AM IST

వర్షపు నీటిలో ప్రభుత్వ పాఠశాల

NLR: రాపూరు మండలం సిద్ధవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు వెళ్లడానికి ఒక వాగును దాటే నీళ్లు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల వైపు మండల విద్యాధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వల్ల దోమలు చేరి విద్యార్థులు విష జ్వరాలకు గురయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల...

December 15, 2024 / 06:02 AM IST

జాతీయ లోక్ అదాలత్‌లో 530 కేసులు పరిష్కారం

ATP: గుత్తి పట్టణంలోని ఏడీజే, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీజే శ్రీహరి, సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథ్ అన్ని రకాల కేసులు కలిపి మొత్తం 530 కేసులను పరిష్కరించమని తెలిపారు.

December 15, 2024 / 05:59 AM IST

రైతుకు అండగా ఎస్సై సుధాకర్ యాదవ్

ATP: పామిడి మండలం జి కొట్టాల గ్రామానికి చెందిన రైతు సుదర్శన్ గడ్డివాముకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న పామిడి ఎస్సై సుధాకర్ యాదవ్ శనివారం తన సొంత ఖర్చుతో 5 ట్రాక్టర్ల గడ్డివామును రైతుకు అందజేశారు. ఎస్సై మాట్లాడుతూ.. ఓ రైతు ఆవేదనను అర్థం చేసుకునీ రైతుకు సొంత ఖర్చులతో రూ.లక్ష 50 వేల గడ్డివామును అందజేశామన్నారు.

December 15, 2024 / 05:57 AM IST

వెంకటేశ్వర స్వామి మాల ధరించిన మడకశిర ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే MS రాజు ఇటీవల కూటమి ప్రభుత్వం టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించింది. టీటీడీ సభ్యులుగా మరింత భక్తిశ్రద్ధలతో నిష్ఠతో ఉండాలనే ఉద్దేశంతో శనివారం గోవింద మాలధారణ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ సభ్యులుగా ఎన్నికైనందుకు గొప్ప అదృష్టంగా భావించి శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణం చేసుకుంటూ టీటీడీ అభివృద్ధికి మరింత కృషి చేస్తాననారు.

December 15, 2024 / 05:57 AM IST

భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని బాబయ్య స్వామి దర్గా ఉరుసు సందర్భంగా పోలీస్ భద్రత ఏర్పాట్లును జిల్లా ఎస్పీ వి.రత్న శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాబయ్య స్వామిని ఎస్పీ దర్శించుకున్నారు. భక్తులుకు ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ, సీఐ పాల్గొన్నారు.

December 15, 2024 / 05:54 AM IST

మంత్రి లోకేశ్‌ను కలిసిన BVV రాముడు

సత్యసాయి: అమరావతిలోని ఏపీ సచివాలయం నందు శనివారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను టీడీపీ సీనియర్ నాయకుడు BVV రాముడు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శ్రీసత్యసాయి జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

December 15, 2024 / 05:51 AM IST

‘నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలా వేమిరెడ్డి అడుగులు’

NLR: నెల్లూరు జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కరించే దిశగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగులు వేస్తున్నారని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నిరుద్యోగ సమస్యను అధిగమించేలా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రారంభించారన్నారు. ఎంపీగా వేమిరెడ్డి రావడం జిల్లా ప్రజలకు శుభపరిణామమని అన్నారు.

December 15, 2024 / 05:44 AM IST

కొత్తపల్లి జలపాతం వద్ద పర్యాటకుల సందడి

ASR: జీ.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. వీకెండ్ రెండవ శనివారం కావడంతో జలపాతం అందాలను చూసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. శనివారం రాత్రి కూడా జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. సుందరీకరణ పనుల్లో భాగంగా జలపాతం వద్ద విద్యుద్దీపాలు అలంకరణ చేశారు. విద్యుత్ కాంతులీనుతూ జలపాతం అందాలు మరింత కనువిందు చేశాయి.

December 15, 2024 / 05:44 AM IST