• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పొన్నూరులో కంపోస్ట్ పనులను పరిశీలించిన కమిషనర్

GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శుక్రవారం పట్టణంలోని కంపోస్ట్ యార్డును సందర్శించి వ్యర్థాల నిర్వహణ పనులను పర్యవేక్షించారు. సేంద్రియ ఎరువు (వర్మి కంపోస్ట్) తయారీలో జాప్యం చేయకుండా నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం MRF సెంటర్‌లో పొడి వ్యర్థాల వర్గీకరణ తీరును తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

February 20, 2026 / 02:40 PM IST

‘చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాలి’

W.G: ఏపీ సచివాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆర్టీసీ ఎండీ కృష్ణ బాబుని కలసి చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దులో, మారుమూల ఉండటం వలన సరైన ప్రయాణ సాధనాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందిని వివరించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిని పరిశీలించిన అనంతరం అందుకు అవసరమైన చర్యలు చేపడతామని కృష్ణబాబు సానుకూలంగా స్పందించారు.

February 20, 2026 / 02:40 PM IST

ఆర్థిక సాయం చేసిన ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్

ATP: గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారానికి చెందిన నిరుపేద నంచర్ల రాము కుమార్తె ఉమ వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన, బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, సుందరయ్య, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:39 PM IST

మాజీ సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్యే

W.G: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ సూచించారని అన్నారు.

February 20, 2026 / 02:36 PM IST

కొత్తవలస ఎమ్మార్వోగా రామలక్ష్మీ

VZM: కొత్తవలస మండల రెవెన్యూ అధికారిణిగా ఎస్. రామలక్ష్మీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ప్రధాన భూపరిపాలన విభాగంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె సోమవారం లేదా గురువారం కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఆ స్థానంలో విధులు నిర్వహించిన అప్పలరాజు జిల్లాకలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే.

February 20, 2026 / 02:35 PM IST

యాంటీ ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

CTR:”ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు” అనేది ప్రతి విద్యార్థి నినాదం అవ్వాలని డీఎస్పీ సయ్యద్ మొహమ్మద్ అజీజ్ పిలుపునిచ్చారు. కార్వేటినగరంలోని ఐటీఐ కళాశాలలో నగరి డీఎస్పీ, సీఐ హనుమంతప్ప, ఎస్సై తేజస్విని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసే ర్యాగింగ్‌కు కళాశాలల్లో చోటు లేదని స్పష్టం చేశారు.

February 20, 2026 / 02:32 PM IST

తౌషిక్ కుటుంబాన్ని పరామర్శించిన దద్దాల

ప్రకాశం: కనిగిరి 9 వ వార్డుకు చెందిన సయ్యద్ ఆలీ కుమారుడు తౌషిక్ సింగరాయకొండలోని నవోదయ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతూ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. ఎంతో బాధాకరమైన ఘటనగా పేర్కొన్నారు. ఈ మేరకు తౌషిక్ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

February 20, 2026 / 02:32 PM IST

యాప్ ద్వారా కిసాన్ డ్రోన్ బుకింగ్

SKLM: రైతులు కిసాన్ డ్రోన్ సేవలను సులభంగా పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించిందని వ్యవసాయ శాఖ ఏడీ వెంకట మధు శుక్రవారం తెలిపారు. ప్లే స్టోర్‌‌లో లభ్యమయ్యే ‘డ్రీన్ మాట్’ యాప్‌‌ను డౌన్‌ లోడ్ చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయాలని సూచించారు. దీని ఆధారంగా రైతుల అవసరాలకు డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు.

February 20, 2026 / 02:32 PM IST

భవిత సెంటర్ అకస్మిక తనిఖీ

E.G: గోకవరం మండల కేంద్రంలో సర్వ శిక్షణ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత సెంటర్‌ని జిల్లా సహిత విద్యా సమన్వయకర్త కనక బాబు శుక్రవారం అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భవిత సెంటర్లో ( మానసిక విద్యార్థుల ) యాక్టివిటీస్‌ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అలాగే ఫిజియోథెరపీ సేవలను విద్యార్థులకు ఎలా అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

February 20, 2026 / 02:30 PM IST

మద్దిపి గ్రామంలో కాలుష్య నీరు సమస్య

సత్యసాయి: లేపాక్షి మండలం కంచి సముద్రం పంచాయతీ మద్దిపి గ్రామంలో చెరువు బోరులోని నీరు గత వారం నుంచి కలుషితమై మట్టి నీరు వస్తోంది. కనీసం కడుక్కోవడానికి కూడా వీలులేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వేసిన కొత్త బోరును ప్రారంభించి ట్యాంక్‌కు నీరు అందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

February 20, 2026 / 02:30 PM IST

కేసులకు భయపడను.. ఎక్కడా తగ్గను: అంబటి

GNTR: జైలు నుంచి విడుదలైన అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒకరికి ఒక రోజు వస్తుంది తనకు కూడా రోజు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఎదిగిన తాను ఇటువంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు ఇస్తానని తెలిపారు.

February 20, 2026 / 02:25 PM IST

‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

KRNL: దేవనకొండ మండలంలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనల నేపథ్యంలో సీఐ వేణుగోపాల్ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీస్‌లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించవద్దని, బంగారు ఆభరణాలు బహిరంగంగా ప్రదర్శించరాదని CI వెల్లడించారు.

February 20, 2026 / 02:25 PM IST

‘పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని తక్షణమే చెల్లించాలి’

NTR: తిరువూరులో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణయ్య శుక్రవారం హాజరయ్యి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని తక్షణమే చెల్లించాలన్నారు. 2019 నుంచి ఉద్యోగం చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 02:23 PM IST

పెంటపాడులో కనకదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట

W.G: పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో శ్రీ కనక దుర్గా దేవి నూతన ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ కో ఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేేక పూజలు చేశారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

February 20, 2026 / 02:21 PM IST

నర్సీపట్నంలో లేగ దూడల ప్రదర్శన

AKP: నర్సీపట్నం(మం) చెట్టుపల్లిలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ.. రైతుల్లో పాడి పశువుల పెంపకంపై అవగాహన పెంచుతున్నామన్నారు. మేలు రకము సంతతిని వృద్ధి చేయడానికి పశుసంవర్ధక శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.

February 20, 2026 / 02:20 PM IST