• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు సగుటూరు గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ

CTR: పుంగనూరు బండ్లపల్లి గ్రామం సొసైటీ కాలనీలో సగుటూరు గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకం శనివారం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. ఆదివారం అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ, కుంబాభిషేకము, మహా పూర్ణాహుతి, అలంకరణ పూజా అధికారి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

February 20, 2026 / 05:04 PM IST

ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

సత్యసాయి: కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ దేవానంద్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి ఆలయానికి డా.బత్తల హరిప్రసాద్ శుక్రవారం రూ.1,25,000 లక్షల విరాళం అందజేశారు. ఆయన వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఆలయ విగ్రహాలు, లోపల గ్రానైట్ బండల ఏర్పాటు కోసం ఈ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు స్వయంగా అందజేశారు.

February 20, 2026 / 05:00 PM IST

LRS స్కీం‌పై టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమావేశం

ATP: గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి చాంబర్‌లో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ స్కీములపై టౌన్ ప్లానింగ్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు. నిబంధనలు పాటించి పట్టణ ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోనేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

February 20, 2026 / 05:00 PM IST

సీఎం సహాయని చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో తాజాగా 36 మందికి రూ.16,24,276లు ఆర్థికసాయం తాజాగా మంజూరైంది. మైలవరం, గొల్లపూడి గ్రామాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు చెక్కులు రూపంలో ముఖ్యమంత్రి సహాయనిధిని శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం అన్నారు.

February 20, 2026 / 04:58 PM IST

కొర్రపాడులో పశు వైద్య శిబిరం నిర్వహణ

KDP: రాజుపాలెం(M) కొర్రపాడులో శుక్రవారం ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. NSS ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇందిర ఆధ్వర్యంలో గైనకాలజీ, మెడిసిన్, ఆపరేషన్ ఇతర 40 కేసులకు సంబంధించి చికిత్సలు అందించారు. పశువుల వ్యాధి నివారణకు డీ-వార్మింగ్, డీ-టికింగ్ నిర్వహించారు. పశుపోషణ, వ్యాధులపై, చికిత్సలపై రైతులకు అవగాహన కల్పించారు.

February 20, 2026 / 04:56 PM IST

ఆర్టీసీ స్థలాలను కాపాడుకుందాం: SWF

KRNL: విలువైన ఆర్టీసీ స్థలాలను కాపాడుకుందాం అంటూ శుక్రవారం కర్నూలు ఆర్టీసీ డిపో ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు హాజరై సంఘీభావం తెలిపారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 11,000 రెగ్యులర్ కార్మికుల పోస్టులను రిక్రూట్‌మెంట్ ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

February 20, 2026 / 04:51 PM IST

విద్యార్థులకు పెన్నులు అట్టలు పంపిణీ

AKP: కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థులు శుక్రవారం పెన్నులు, అట్టలు పంపిణీ చేశారు. హెచ్ఎం సుకుమార్ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు వారి చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 04:50 PM IST

జైభీమ్ ఎమ్మార్పీఎస్ నేతకు పరామర్శ

KRNL: ఆదోనిలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆదోని నియోజకవర్గ ఇంఛార్జ్ మాదాసుల రాజబాబు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆయన ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

February 20, 2026 / 04:49 PM IST

‘రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించాలి’

ASR: జాబ్ కార్డులు ఉన్నవారందరికీ ఉపాధి పనులు కల్పించాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన బకులూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. నాణ్యంగా పనులు చేయాలని వేతనదారులకు సూచించారు. రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.

February 20, 2026 / 04:46 PM IST

అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ

KRNL: పత్తికొండలో చైన్ స్నాచింగ్ మరియు దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇవాళ సీఐ పులిశేఖర్ గౌడ్ తెలిపారు . మహిళలు సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించవద్దన్నారు. దేవనకొండ, గోనెగండ్ల, ఆదోని ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇళ్ల తలుపులు, వాహనాలు సురక్షితంగా లాక్ చేసుకోవాలని, సూచించారు.

February 20, 2026 / 04:46 PM IST

ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హానికరం

ATP: గుంతకల్లు ఎస్కే పీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ లక్ష్మీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంట్లో, పాఠశాల, కళాశాలలో ఉపయోగించే నీటిని సహజ పద్ధతుల ద్వారా శుద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగించొద్దిని తెలిపారు.

February 20, 2026 / 04:45 PM IST

అంగనవాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఐసీడీఎస్ పీడీ

KRNL: ఆదోని పట్టణ పరిధిలోని తిక్క స్వామి దర్గా ప్రాంతంలోని అంగనవాడీ కేంద్రం 85ను శుక్రవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ , సీడీపీఓ ఢిల్లీ ఈశ్వరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, పీడీ విజయ పిల్లలు హాజరు పట్టిక పరిశీలించారు. అలాగే పిల్లలుకు ఇస్తున్న ఆహరం, పిల్లలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ నందు సరుకుల నిలువ, కేంద్రం పరిశుభ్రతను తనిఖీ చేశారు.

February 20, 2026 / 04:43 PM IST

‘సహకార సంఘ ఉద్యోగులకు సీఎం సహకరించాలి’

ELR: సహకార సంఘ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సహకరించాలని సామాజిక కార్యకర్త శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన చాట్రాయి కోపరేటివ్ యూనియన్ బ్రాంచ్ కార్యాలయం వద్ద నూజివీడు నియోజకవర్గ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. వారికి సంఘీభావంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు

February 20, 2026 / 04:41 PM IST

లడక్ శిక్షణకు విద్యార్థి ఎంపిక

SKLM: మెలియాపుట్టి మండల ZPHSకు చెందిన వీ. జ్ఞాన సాయి ఉన్నత ప్రతిభ కనబరిచారు. జ్ఞాన సాయి అడ్వెంచర్స్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో శిక్షణ పొంది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లడక్ శిక్షణకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు 1,2లు యస్. దేవేంద్రరావు, ఎం. పద్మనాభం,పాఠశాల H.M గీత, ఉపాధ్యాయులు జ్ఞాన సాయిని ఘనంగా సత్కరించారు.

February 20, 2026 / 04:41 PM IST

గిరిజన జీవనోపాధిపై అవ‌గాహ‌న స‌ద‌స్సు

విశాఖలోని ICAR-CMFRI రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో గిరిజనులకు శుక్ర‌వారం అవగాహన సదస్సు నిర్వహించారు. మత్స్య సంపద ద్వారా ఆదాయం పెంపు, జలాశయాలు–చెరువుల శాస్త్రీయ వినియోగంపై శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా మత్స్య సంపద, ఆక్వాకల్చర్ అభివృద్ధికి అవసరమైన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

February 20, 2026 / 04:38 PM IST