రవితేజ మూవీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావుపై కేసు నమోదైంది. అంతేకాకుండా స్టువర్టుపురం ప్రజలు, ఎరుకల జాతి ప్రజలు వెంటనే సినిమాను ఆపేయాలని విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టారు.
తిరుపతి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వడమల చెక్‌పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని అదే దారిలో వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరోవైపు రోడ్డుపై వెళ్తున్న కారును చిత్తూరు నుంచి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఢీకొని మృతి చెందారు.
రాయదుర్గం సభలో వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్షలు చేశారు చంద్రబాబు. ఆయన పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ వ్యాఖ్యనించారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
జీడిపప్పు పరిశ్రమలు నష్టాల్లోకి వెళ్లడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జీడిపప్పుకు ఫేమస్ అయిన వేటపాలెంలో 10 పరిశ్రమలు మూతపడ్డాయి. 5,500 మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది.
తిరుమల(Tirumala) తిరుపతి అలిపిరి మార్గంలో ఇటివల కనిపించిన చిరుత(leopard) ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. దీంతో గత రెండు నెలల్లో ఇప్పటివరకు ఐదు చిరుతలు చిక్కినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ పలువురు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలోని భీమవరం(bhimavaram)లో యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)కు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ వాటిని తీసుకునేందుకు లోకేష్ నిరాకరించారు.
రామకోటి మాదిరిగా గోవింద కోటి నామాలు(Govinda namam) రాసిన వారికి, వారి ఫ్యామిలీకి ఉచితంగా వీఐపీ దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. అయితే అలా రాసిన పుస్తకం తమకు చూపించాలని లేదా పంపించాలని తెలిపారు.