28 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జిమ్ కు వెళ్లి ఆకస్మాత్తుగా కూప్పకూలిపోయాడు. గమనించిన తన తోటి మిత్రులు అతన్ని లేపి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషాద ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఐటీ అధికారులమని 50 లక్షలు దోచుకున్న దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 లక్షల రూపాయలకు గాను రూ.48.30 లక్షల నగదు, అరకిలో గోల్డ్ కు గాను 132 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేసిన మహిళా డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. గత ఐదేళ్లుగా నరకం అనుభవించిన మహిళ ఇటీవల స్కాన్ చేయించుకోగా అసలు విషయం తెలిసింది.
vallabhaneni vamsi on lokesh:టీడీపీ యువనేత నారా లోకేశ్ (lokesh) జూనియర్ ఎన్టీఆర్‌ను (jr ntr) పార్టీలోకి రావాలని ఇచ్చిన పిలుపు అగ్గిరాజేసింది. ఈ రోజు ఉదయమే మాజీమంత్రి కొడాలి నాని.. లోకేశ్‌ను ఏకీపారేశారు. ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ (vamsi) వంతు వచ్చింది. తెలుగుదేశం పార్టీ పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ తాత నందమూరి తారక రామరావు అని పేర్కొన్నారు. మరీ ఆయనను పార్టీలోకి ఆహ్వానించేది ఏంటీ అంటూ దుయ్యబట్టారు.
murder in dachepalli:పల్నాడు జిల్లా గురజాలలో దారుణ హత్య జరిగింది. దాచేపల్లిలో గొడ్డలితో ముక్కలుగా నరికి హతమార్చారు. మృతదేహాన్ని దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న మిర్చి తోటలో దగ్ధం చేశాడు. వివాహేతర సంబంధ నేపథ్యంలో హత్య జరిగింది. మృతుడు కోటేశ్వరరావు (45) దాచేపల్లి నగర పంచాయితీలో పంప్ ఆపరేటర్ ( ఔట్ సోర్సింగ్) పనిచేసేవారని తెలుస్తోంది.
తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే త్వరలోనే మొదటిసారిగా హైదరాబాద్ పరిధిలో మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ది సంస్థ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్లు సక్సెస్ అయిన క్రమంలో.. మటన్ క్యాంటీన్లను మార్చిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
kodali nani on lokesh:టీడీపీ యువ నేత నారా లోకేశ్‌పై (lokesh) మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్‌ను (jr.ntr) టీడీపీలో చేరమని లోకేశ్ (lokesh) అడగడం ఏంటీ అని మండిపడ్డారు. ఆ పార్టీ ఆయన తాత పెట్టింది అని పేర్కొన్నారు. లోకేశ్ (lokesh) ఆహ్వానించడం ఏంటో అర్థం కావడం లేదన్నారు.
తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం పర్యావరణ పరిరక్షణకు అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా టీటీడీ(TTD) ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మరో వినూత్న ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని(Srivari laddu prasadam) ఇక నుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించనుంది.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) విచారణలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy)కి నోటీసులు ఇచ్చింది సీబీఐ (CBI).
ఫోన్ కూడా చేయడం లేదని ప్రశ్నించడంతో ఆవేశంలో దేవేంద్ర రెడ్డి చేసిన దారుణాన్ని వివరించాడు. ఇది విన్న తాత శివారెడ్డి హతాశయుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు దేవేంద్ర రెడ్డిని తీసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో మృతదేహం కోసం పరిశీలించారు. మొదటి రోజు ఆనవాళ్లు లభించకపోవడంతో రెండో రోజు ఆమె శరీర అవయవాలు లభించాయి.
తాను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానిని అని, ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాను (vaaltheru veeraiah film) చూశానని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) అన్నారు. యువ గళం పాదయాత్ర లో (yuva galam padayatra) భాగంగా తిరుపతి లో (tirupati) యువతతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. చిరంజీవి గారికి నేను కూడా ఓ అభిమానిని అని, ఆ...
పలుకుబడి ఎవరికి అధికంగా వారి పేర్లు వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం పాకులాడుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకుల పేర్లు వాడుకుంటోంది. పేర్లు పెట్టడం ద్వారా ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) పైన
పులివెందులకు చెందిన భరత్ కుమార్ అనే విలేకరి (reporter) మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల (temple) అభివృద్ధి చేస్తాం.. ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu Satyanarayana)తెలిపారు. ఆ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వివాదంలో ఉన్న 4,700 ఎకరాలను సంబంధిత దేవస్థానాలకు చెందేలా జీవో తీసుకొస్తున్నాం అని వెల్లడించారు..
ఆంధ్రప్రదేశ్ టూరిజం (Tourism) శాఖ రూపొందించిన ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్‌ను ఏపీ సీఎం (CM AP) జగన్ ఆవిష్కరించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో (Vizag) జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్ పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది