»Party Give To Junior Ntr Kodali Nani Asked To Lokesh
kodali nani on lokesh:పార్టీని జూ.ఎన్టీఆర్‌కు ఇచ్చేయు.. లోకేశ్‌పై కొడాలి నాని ఫైర్
kodali nani on lokesh:టీడీపీ యువ నేత నారా లోకేశ్‌పై (lokesh) మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్‌ను (jr.ntr) టీడీపీలో చేరమని లోకేశ్ (lokesh) అడగడం ఏంటీ అని మండిపడ్డారు. ఆ పార్టీ ఆయన తాత పెట్టింది అని పేర్కొన్నారు. లోకేశ్ (lokesh) ఆహ్వానించడం ఏంటో అర్థం కావడం లేదన్నారు.
party give to junior ntr kodali nani asked to lokesh
kodali nani on lokesh:టీడీపీ యువ నేత నారా లోకేశ్‌పై (lokesh) మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్‌ను (jr.ntr) టీడీపీలో చేరమని లోకేశ్ (lokesh) అడగడం ఏంటీ అని మండిపడ్డారు. ఆ పార్టీ ఆయన తాత పెట్టింది అని పేర్కొన్నారు. లోకేశ్ (lokesh) ఆహ్వానించడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. నిన్న తిరుపతి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో నారా లోకేశ్.. తారక్‌ను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆ అంశంపై కొడాలి నాని (kodali nani) రియాక్ట్ అయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించి.. చంద్రబాబు (chandrababu), లోకేశ్ (lokesh) పార్టీ నుంచి తప్పుకోవాలని కొడాలి నాని (kodali nani) డిమాండ్ చేశారు. మార్పు రావాల్సింది రాష్ట్రంలో కాదు.. టీడీపీలో అని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ను (cm jagan) ఓడించే దమ్ము లేక జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. తారక్‌నే కాదు.. చిరంజీవి (chiranjeevi) గురించి కూడా లోకేశ్ మాట్లాడారు. తాను చిరంజీవి అభిమానిని అని.. ఫస్టో డే.. ఫస్ట్ షో ఆయన సినిమా చూస్తానని వివరించారు. ఎన్నికల వేళ.. లోకేశ్ సొంత ఇమేజీతో కాక ఇలా చిరు, తారక్ అంటున్నారని కొడాలి నాని ధ్వజమెత్తారు.
చదవండి:nara lokesh on jr.ntr:నారా లోకేశ్ సంచలనం, జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి
జూనియర్ ఎన్టీఆర్ (jr.ntr) రాజకీయాల్లోకి రావాలని నారా లోకేశ్ నిన్న కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకునేవారంతా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటారని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరారు. రాజకీయాల్లోకి వచ్చేవారికి కావాల్సింది.. మంచి మనసు అని చెప్పారు. 2014లోనే పవన్ కల్యాణ్‌లో అతని మనస్సు చూశానని లోకేశ్ (nara lokesh) గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో జనసేన (janasena) టీడీపీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాపు ఓట్లు టీడీపీకి మళ్లాయి. దీంతో ఆ సమయంలో టీడీపీ అధికారం చేపట్టింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను (jr.ntr) పేరు జపిస్తున్నారు. ఆయన అభిమానుల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని అనుకుంటున్నారు.
లోకేశ్ కామెంట్లపై కొడాలి నాని (kodali nani) స్పందించారు. తారక్ అంటే కొడాలి నాని, వంశీ (vamsi) అభిమానిస్తారు. వీరు అంతా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి.. హరికృష్ణ (hari krishna) వర్గం. ఒకవేళ టీడీపీని తారక్ టేకోవర్ చేస్తే.. కొడాలి నాని, వంశీ తిరిగి ఆ పార్టీలోకి వచ్చినా రావచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండటంతోనే వారు సీఎం జగన్‌కు (jagan) దగ్గర అయ్యారని మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే కొడాలి నాని వైసీపీ నేతగానే స్పందించారు. లోకేశ్‌ను పార్టీ వీడి వెళ్లాలని సూచించారు.