»A Software Engineer Died Of A Heart Attack While Going To The Gym Adoni Kurnool Ap
Heart Attack: జిమ్ కు వెళ్లి గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
28 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జిమ్ కు వెళ్లి ఆకస్మాత్తుగా కూప్పకూలిపోయాడు. గమనించిన తన తోటి మిత్రులు అతన్ని లేపి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషాద ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.
ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్(28)(software engineer) జిమ్(gym)కు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన అతని స్నేహితులు హుటాహుటిన ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆ క్రమంలో అతన్ని పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే గుండెపోటు(heart attack)తో మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోని(adoni kurnool ap)లో చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు(family) ఆస్పత్రికి చేరుకుని విలపించారు. అతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు అతని పేరు చెప్పేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
అయితే ఇతను హైదరాబాద్లోని(hyderabad) ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్(software engineer) గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వర్క్ హోం విధానంలో ఇంటి వద్దే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. మరోవైపు ఇతనికి ఇటీవలె పెళ్లి కూడా ఖాయామైంది. ఎక్సర్ సైజ్ చేసేందుకు శనివారం ఉదయం ఆదోని ఆర్ట్స్ కాలేజీ పరిధిలో ఉన్న జిమ్(gym)కు వెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే కళ్లు తిరిగి పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు సపర్యలు చేయగా మెలకువలోకి వచ్చాడు. ఆ క్రమంలో కాసేపటికీ మళ్లీ కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
రోజురోజుకు గుండెపోటు(heart attack)తో మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గతంలో ఎక్కువగా స్థూలకాయం ఉన్న వారు, వయసు పైబడిన వారికి హార్ట్ ఎటాక్ ఎక్కువగా వచ్చేది. కానీ ప్రస్తుతం 40 ఏళ్ల లోపు యువకులే ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్(secunderabad) లోని ఓ జిమ్ లో విశాల్ అనే కానిస్టేబుల్(constable) వ్యాయామం చేస్తుండగా కూప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రి(hospital)కి తరలించారు. కానీ అప్పటికే విశాల్ మృతి చెందినట్లు వైద్యులు(doctors) ప్రకటించారు.
ఇంకోవైపు మూడు రోజుల క్రితం హైదరాబాద్(hyderabad) పాతబస్తి కాలపత్తర్ పీఎస్ పరిధీలో మహ్మద్ రబ్బానీ అనే యువకుడు తన స్నేహితులను(friends) నవ్వుతూ పలకరిస్తూ కింద పడిపోయాడు. వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ మృతి చెందాడని డాక్టర్లు వెల్లడించారు. మరో ఘటన గుజరాత్లోని(gujarat) అహ్మదాబాద్లో జరిగింది. క్రికెట్ మ్యాచ్(cricket match) ఆడుతున్న క్రమంలో ఓ వ్యక్తికి ఆకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చి గ్రౌండ్ లోనే కిందపడిపోయాడు. వెంటనే పక్కనున్న వారు ఆస్పత్రి(hospital)కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ద్రువీకరించారు.