• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గ్రామాల అభివృద్ధికి అధికారులు సహకరించాలి

VZM: భోగాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూష ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణ రాజు హాజరై అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. గ్రామాల అభివృద్ధికి అధికార యంత్రాంగం సహకరించాలన్నారు. అభివృద్ధి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలపై సర్పంచ్ లు, ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వాలన్నారు.

February 22, 2026 / 03:09 PM IST

GJM చారిటబుల్ ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయం

CTR: రెట్టగుంట గ్రామంలోని శ్రీ సుందర వినాయకస్వామి ప్రత్యేక పూజా అభిషేక కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి, గురజాల చెన్నకేశవులు నాయుడు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆయనకు ఘన స్వాగతం పలికిపూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన GJM చారిటబుల్ ఫౌండేషన్ తరపున ఆలయ అభివృద్ధికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.

February 22, 2026 / 03:08 PM IST

టీడీపీ నూతన కార్యాలయానికి శంఖస్థాపన

కడప: జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి శంఖస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి,కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ,మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతో పాటు రాష్ట్ర,పార్లమెంట్ కమిటీ నేతలు, జిల్లా పార్టీ నాయకులు హాజరయ్యారు.

February 22, 2026 / 03:07 PM IST

ప్రత్యేక పూజలో పాల్గొన్న మంత్రి

కోనసీమ: రామచంద్రపురం అంకం వారి వీధి వెంకటనగర్‌లో నూతనంగా నిర్మించిన లక్ష్మీ గణపతి స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో జీవించాలని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.

February 22, 2026 / 03:02 PM IST

కలెక్టరేట్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళి

అనంతపురం కలెక్టరేట్‌లో ఆదివారం వీరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని పర్యాటక శాఖ, ఆన్ సెట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి అటూరి మాలోల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తెలుగు వీరుడు నరసింహారెడ్డి అని ఆయన కొనియాడారు.

February 22, 2026 / 03:00 PM IST

మ్యాట్రిమోనీ పేరుతో మోసం.. నిందితుడు అరెస్ట్

GNTR: తెనాలిలో మ్యాట్రిమోనీ పేరుతో మహిళను మోసం చేసిన కొత్తూరులంకకు చెందిన అరవపల్లి వంశీని త్రీటౌన్ సీఐ సాంబశివరావు ఆదివారం అరెస్టు చేశారు. పెళ్లి పేరుతో రూ.12 లక్షలు వసూలు చేసి వివాహం చేయకుండా మోసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

February 22, 2026 / 02:56 PM IST

సీఎం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

గుంటూరు నగరానికి రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. బొమ్మిడాల నగర్‌లోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఇండియా పోస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “డాక్ సేవక్ సమ్మేళన్” కార్యక్రమానికి సీఎం హాజరుకానున్న సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.

February 22, 2026 / 02:54 PM IST

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

కృష్ణా: నందివాడ మండలం రుద్రపాక జిల్లా పరిషత్ పాఠశాలలో 1989,1990 సంవత్సర 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 36 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను వారు నెమరేసుకున్నారు. చదివిన సమయంలో చేసిన అల్లర్లు, ఉపాధ్యాయులతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

February 22, 2026 / 02:54 PM IST

రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులకు అవగాహన

కృష్ణా: మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సీఐ నున్న రాజు రోడ్డు భద్రత నియమాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించకుండా వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామన్నారు.

February 22, 2026 / 02:51 PM IST

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: కందుకూరులోని కోటారెడ్డి నగర్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. రూ.28.50 లక్షల వ్యయంతో వాటిని నిర్మించినట్లు మున్సిపల్ కమిషనర్ అనూష తెలిపారు. స్థానిక ప్రజల కోరిక మేరకు వీటి నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 22, 2026 / 02:50 PM IST

ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన

కృష్ణా: మొవ్వ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:50 PM IST

పరిగిలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

సత్యసాయి: పరిగి మండలంలో రూ. 2.10 కోట్ల నిధులతో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. మండల టీడీపీ కన్వీనర్‌ గోవింద రెడ్డి మాట్లాడుతూ.. పాపిరెడ్డిపల్లి నుంచి శ్రీరంగరాజుపల్లి వరకు రూ.1.20 కోట్లు, మధుగిరి రోడ్డు నుంచి పుట్టగూర్లపల్లి వరకు రూ. 90 లక్షల వ్యయంతో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:50 PM IST

ఆర్గానిక్ ఫార్మింగ్ మేళాను ప్రారంభించిన ఎంపీ

NTR: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఆర్గానిక్ రైతోత్సవం, న్యాచురల్ ఫార్మింగ్ మేళాను ఎంపీ కేసినేని చిన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువులు వాడకం తగ్గించాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని అన్నారు. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అధిక ఆదాయం, నాణ్యమైన ఆహారం అందుతుందని తెలిపారు.

February 22, 2026 / 02:50 PM IST

రేపు యథావిధిగా రెవెన్యూ క్లినిక్: కలెక్టర్

E.G: రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘మీకోసం కార్యక్రమం’ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే, నమోదైన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

February 22, 2026 / 02:50 PM IST

కాంగ్రెస్ కార్యాలయంపై దాడి పిరికిపంద చర్య

KRNL: దేవనకొండలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో కర్నూలులో కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడిని జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగం, వాణిజ్య ఒప్పందాలపై ప్రశ్నిస్తే దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. దాడులతో కాంగ్రెస్ శ్రేణులను భయపెట్టలేరని హెచ్చరించారు.

February 22, 2026 / 02:48 PM IST