• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గుంతకల్లులో వరుసగా నాలుగు ఇళ్లలో చోరీ

ATP: గుంతకల్లులోని మోదినాబాద్ ఏరియాలో గల రైల్వే క్వార్టర్స్‌లో ఆదివారం అర్ధరాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న నగదుతో పాటు నగలు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరిసర ప్రాంతాలతో పాటు సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

February 23, 2026 / 08:10 AM IST

ట్రైన్‌లో బంగారం ఉన్న బ్యాగ్ చోరీ

VSP: విశాఖ నుంచి ఆగ్రాకు వెళ్తున్న మహిళ బ్యాగ్ రైల్వే స్టేషన్లో మిస్ అయింది. బ్యాగ్‌లో 200 గ్రాముల బంగారం, రూ.12,500 ఉన్నట్టు ఆమె సీపీకి ఫోన్ చేశారు. సీపీ RPF పోలీసులకు సమాచారం అందించగా సీసీ కెమెరాలను పరిశీలించి హర్యానాకు చెందిన వ్యక్తి బ్యాగును దొంగలించి ట్రైన్‌లో వెళ్లిపోయినట్టు గమనించిన RPF పోలీసులు అతడిని అరెస్టు చేసి బ్యాగు స్వాధీన పరుచుకున్నారు .

February 23, 2026 / 08:05 AM IST

నేటి నుంచి శనగ కొనుగోలు

KRNL: రైతుకు గిట్టుబాటు ధర కల్పించే చర్యల్లో భాగంగా నేటి నుంచి మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయాధికారి రవి, మార్క్ ఫెడ్ నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు. క్వింటాలు రూ. 5,875కు కొంటామని చెప్పారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

February 23, 2026 / 08:05 AM IST

‘అమలాపురంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ’

కోనసీమ: APSSDC ఆధ్వర్యంలో అమలాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు DSDO హరి శేషు సోమవారం తెలిపారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 23, 2026 / 08:04 AM IST

బుచ్చిరెడ్డపాలెంలో భక్తురాలి వద్ద నుంచి నగదు చోరీ

NLR: బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థాన ఆవరణలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయానికి వచ్చిన మహిళా భక్తురాలు వద్ద మద్యం సేవించిన వ్యక్తి రూ. 5000 అపహరించారు. దీనిని పసిగట్టిన మహిళ అక్కడే ఉన్న సిబ్బందికి తెలియజేశారు. దీంతో అతడిని సిబ్బంది పట్టుకుని అతని వద్ద ఉన్న రూ. 2,000లను తిరిగి ఇప్పించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 08:03 AM IST

మెడిసిన్ సీట్ల పేరిట భారీ మోసం

ELR: విదేశాల్లో వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నిలువునా ముంచిన ఘటన జంగారెడ్డిగూడెంలో వెలుగుచూసింది. పట్టణానికి చెందిన షంషీర్ అహ్మద్ కుమార్తె, మేనల్లుడికి సీట్ల కోసం మహబూబ్ నగర్‌కు చెందిన గుండా రాఘవ రూ.19.50 లక్షలు వసూలు చేశాడు. పలుదఫాలుగా నగదు తీసుకొని సీట్లు ఇప్పించకుండా పట్టించుకోకపోవడంతో బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.

February 23, 2026 / 08:01 AM IST

ఉయ్యూరులో నేటి కూరగాయల ధరలు

కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్లో సోమవారం అధికారులు తాజాగా కూరగాయల ధరల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఫ్రెంచ్‌బీన్స్, కాప్సికం కిలో రూ.62తో అత్యధికంగా నమోదు కాగా, క్యారెట్ రూ.26, టమాటా రూ.15, బీరకాయ రూ.24గా నిర్ణయించారు. పచ్చిమిర్చి రూ.45, వంకాయ రూ.20–22, దొండకాయలు రూ.32, బెండకాయ రూ.24, బంగాళాదుంప రూ.24, బీట్‌రూట్ రూ.28, ఉల్లిపాయలు రూ.23, దోస రూ.26గా ఉంది.

February 23, 2026 / 08:00 AM IST

‘నేడు జడ్పీ కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం’

SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక ‘మీ కోసం’ నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 23, 2026 / 08:00 AM IST

కోడిపందేలపై దాడి.. ఆరుగురి అరెస్ట్

KKD: ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై ఎస్సై లక్ష్మీకాంతం ఆదివారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ.2,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

February 23, 2026 / 08:00 AM IST

అనూరియా కేసులపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం

తూ.గో.జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రాజమండ్రిలో అనూరియా కేసుల క్లస్టర్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే.వెంకటేశ్వరరావు వివరాలు ప్రకారం రాజమండ్రికి చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించి విచారణ ప్రారంభించామన్నారు.

February 23, 2026 / 08:00 AM IST

జిల్లాలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మార్కాపురంలోని కలెక్టరేట్లో ఈ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కావున ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

February 23, 2026 / 07:56 AM IST

నేడు జిల్లా కలెక్టరేట్‌లో ఫిర్యాదుల పరిష్కార వేదిక

PLD: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

February 23, 2026 / 07:56 AM IST

బ్యాంకులో భారీ గోల్డ్ మాయం.. కేసు నమోదు

GNTR: వెంకటపాలెం యూనియన్ బ్యాంకులో కస్టమర్లు దాచుకున్న బంగారం మాయమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు 328 గ్రాముల బంగారం కనిపించకుండా పోయినట్లు ఈ నెల 2న బ్యాంకు మేనేజర్ గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఒక మహిళా ఉద్యోగి లాకర్ నుంచి రెండు పౌచ్‌లను బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

February 23, 2026 / 07:54 AM IST

శుభకార్యంలో విషాదం.. భోజనం చేస్తూ వృద్ధుడు మృతి

GNTR: కొల్లిపర గ్రామానికి చెందిన కొల్లి రామిరెడ్డి (85) ఆదివారం రాత్రి గుదిబండివారిపాలెంలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ భోజనం చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించగా, తీవ్ర గుండె నొప్పితో అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

February 23, 2026 / 07:52 AM IST

నేడే పరీక్ష.. ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9 నుంచి మ.12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు 08554-277626 నంబరుకు కాల్ చేసి సమాచారం పొందవచ్చు.

February 23, 2026 / 07:50 AM IST