• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు

ప్రకాశం: ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లాలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లాలోని 79 పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు.

February 23, 2026 / 08:44 AM IST

‘సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తాం’

PLD: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

February 23, 2026 / 08:36 AM IST

బేతంచెర్ల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సతీమణి పర్యటన

NDL: బేతంచెర్ల పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ పర్యటించారు. పట్టణంలోని చౌడేశ్వరి దేవి ఫంక్షన్ హాల్లో వైసీపీ నాయకుడు కేశవరావు కుమారుని వివాహ వేడుకల్లో ముఖ్య అతిథిగా కాటసాని జయమ్మ పాల్గొన్నారు. అనంతరం ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించారు.

February 23, 2026 / 08:36 AM IST

‘విద్యార్థులంతా ఉత్తమ ఫలితాలు సాధించాలి’

PPM: ఇంటర్మీడియట్ పరీక్షలు రాయిబోయే విద్యార్థులకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థులు ఆంతా బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తే మీ భవిష్యత్ బాగుండడంతో పాటు కుటుంబానికి, గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళవుతారన్నారు.

February 23, 2026 / 08:35 AM IST

అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

ATP: గుత్తిలోని పలు ఇంటర్ పరీక్ష కేంద్రాలలో సోమవారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్దకు అరగంట ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు.

February 23, 2026 / 08:34 AM IST

బాల, బాలికలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలం ఆగినిపర్రు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించిన మండల స్థాయి బాల, బాలికల ఆటల పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు.

February 23, 2026 / 08:30 AM IST

సూర్యనారాయణ స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు ఆదివారం వెల్లడించారు. టికెట్లు రూపేణ, విరాళాలు, ప్రసాదాలు రూపంలో రూ. 6.75 లక్షలు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో KNV D ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.

February 23, 2026 / 08:30 AM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రకాశం: కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గుండమాలకు చెందిన సురేష్‌ అనే వ్యక్తి మృతి చెందారు. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా పక్కనే పోసిన మట్టికుప్పను సురేష్ తన ద్విచక్రవాహనంతో బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 08:30 AM IST

ఏఐ ఫర్ షూర్ వర్క్ షాప్‌లో పాల్గొన్న కలెక్టర్

NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో రైజ్ సెంటర్‌లో నిర్వహించిన ఏఐ ఫర్ షూర్ వర్క్ షాప్‌లో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆధునిక సాంకేతికత ద్వారా వ్యాపారాభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామిక వేత్తలను టెక్నాలజీతో శక్తివంతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

February 23, 2026 / 08:30 AM IST

పాత కక్షలతో యువకుడిపై కత్తిదాడి

W.G: పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు చాకుతో దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. ఆదివారం ఆకివీడులోని గంగానమ్మ కోడు వీధిలో బాధితుడు పవన్ కుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన గోపీచంద్, వెంకటేశ్వరరావు అడ్డగించి గాయపరిచారు. తీవ్ర గాయాలైన పవన్ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

February 23, 2026 / 08:26 AM IST

జీవీఎంసీ హైస్కూల్ విద్యార్థులకు అవార్డులు.

VSP: యూత్ ఫర్ సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “చిగురు” కార్యక్రమంలో మల్కాపురం జీవీఎంసీ హై స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అన్ని విభాగాలలో పాల్గొన్న విద్యార్థులు విజేతలుగా నిలిచి అవార్డులు సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు అభినందించారు.

February 23, 2026 / 08:23 AM IST

నేటి నుంచి ఎల్లమ్మ తిరుణాల

అన్నమయ్య: సుండుపల్లి మండలం చెన్నంశెట్టి పల్లె సమీపంలోని ఎల్లమ్మ తిరుణాల సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం అంకురార్పణ,ప్రత్యేక పూజలు,అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం అభిషేకాలు, పుట్ట బంగారు తెచ్చుట పొంగుబాలు, రాత్రి చెక్కభజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. బుధవారం చాందిని బండ్ల తిరుణాల ఉంటుందని తెలిపారు.

February 23, 2026 / 08:23 AM IST

12 వేల టోకెన్లు జారీ..

TPT: తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఆదివారం భక్తులకు 12 వేల సర్వ దర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు మరో 2 వేల టోకెన్లు జారీ చేశారు.

February 23, 2026 / 08:20 AM IST

సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి

సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు సందర్శకులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రజల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వినతుల్లోని అంశాలను పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారు.

February 23, 2026 / 08:16 AM IST

20 మద్యం సీసాలు స్వాధీనం

AKP: అక్రమంగా తరలిస్తున్న 20 మద్యం సీసాలను కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులను చూసి కె.కాశీ విశ్వనాథం అనే వ్యక్తి పారిపోతుండగా ఎస్సై మనోజ్ కుమార్ పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద ఉన్న 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామన్నారు.

February 23, 2026 / 08:11 AM IST