సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం ఖాళీ అయింది! వరుసగా మూడు రోజుల పాటు బోగి, సంక్రాంతి, కనుమ ఉండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వారంతా తమ ఊళ్లకు వెళ్లారు. ఇప్పటికే గురువారం నుండే హైదరాబాద్ నుండి వరుసగా పండుగ ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికి ఇసుక వేస్తే రాలనంత జనం ఉండే హైదరాబాద్ నగర కూడలిలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. కిలో మీటర్ దూరానికే అరగంట నుండి గంట పట్టే ట్రాఫిక్ జామ్ పరిస...
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సంక్రాంతి పర్వదినం సందర్భంగా 15వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ ఆదివారం ఉదయం వర్చువల్‌గా దీనిని ప్రారంభిస్తారు. తొలి బ్లూ అండ్ వైట్ కలర్ వందే భారత్ నవంబర్ 11, 2022న మైసూరు-బెంగళూరు-చెన్నై మధ్య ప్రారంభమైంది. వీటి మధ్య దూరం 698 కిలో మీటర్లు కాగా, ప్రయాణ సమయం ఎనిమిదిన్నర గంటలు. మొదటి సెమీ హైస్పీడ్ వందేభారత్ మాత్రం ఢిల్లీ కాన్పూర్, అ...
జగన్‌ను మీరు విమర్శించలేదా: సొంత పార్టీ నేతలపై రఘురామ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలయికను వైసీపీ నేతలు తప్పుపట్టడంపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన పార్టీ నుండి గెలిచినప్పటికీ మొదటి నుండి నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు-పవన్ పరస్పరం తిట్టుకున్నారని, అలాంటప్పుడు వారు ఎలా కలుస్తారో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నార...
జనసేనాని పవన్ పై వైసీపీ నేతలు ఒకరి తర్వాత మరొకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. యువశక్తి సభలో పవన్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంతో.. వైసీపీ నేతలు విమర్శలకు ప్రతి దాడి చేయడం మొదలుపెట్టారు. పవన్ హవాలా డబ్బులతో దొరికిపోయాడని మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. పవన్ ఆరాటం మొత్తం చంద్రబాబు కోసమేనని ఆయన అన్నారు. కాపులను పవన్ కల్యాణ్ తన యజమాని చంద్రబాబుకు అప్పగించాడన్నారు. ఇలాంటి శ...
క్యాసినో కేసు, విదేశాలకు డబ్బు మళ్లించారనే అభియోగాలతో చీకోటి ప్రవీణ్ కుమార్‌ను ఈడీ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. కేసు వెలుగుచూసిన వెంటనే ప్రవీణ్ రాయల్ లైఫ్, ఫామ్ హౌస్‌లో అతని పెట్స్ చర్చకు వచ్చాయి. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీలో కోడొ పందాలు చూసేందుకు వచ్చానని ఆయన చెబుతున్నారు. అంతేకాదు క్యాసినో కేసుకు సంబంధించి అందరి పేర్లు బయటపెడతానని ప్రవీణ్ హా...
జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శల వర్షం కురిపించారు. పవన్ ఓ సీజనల్ పొలిటీషియన్ అంటూ సెటైర్లు వేశారు. పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉండరంటూ విమర్శలు చేశారు. ఆవేశపూరిత స్పీచ్ లతో పవన్ కల్యాణ్ యువతను అజ్ఞానంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధర్మాన ఆరోపించారు. నాటి కిడ్నీ బాధితుల సమస్యలు నేడు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. పుస్తకాలు చదవడం కాదు.. ఆ గొప్ప భావజా...
నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను సంజయ్ కొనియాడారు. తొలి తెలంగాణ ఉద్యమ నేత మర్రి చెన్నారెడ్డి అంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ లో వేలకోట్ల నిజాం అక్రమ ఆస్తులను, స్థలాలను కబ్జా కాకుండా అడ్డుకొని తెలిపారు. అవీ ప్రజలకు ఉపయోగపడేలా చేశారని గుర్తుచేశారు. 1969లో తెలం...
థియేటర్లో వీరసింహారెడ్డి ఊచకోతకు.. రికార్డులు బద్దలవుతున్నాయి. అఖండ బ్లాక్ బస్టర్.. అన్ స్టాపబుల్ టాక్ షో.. బాలయ్య క్రేజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఇలాంటి సమయంలో క్రాక్ బ్లాక్ బస్టర్‌తో జోష్ మీదున్న గోపీచంద్ మలినేని.. బాలయ్యతో వీరసింహారెడ్డి తెరకెక్కించాడు. దానికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడం.. సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చింది. అందుకు తగ్గట్టే బాలయ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే వారికి అంత భయం, పిరికితనం ఎందుకు అని ప్రశ్నించారు. అధికారం ఉందనే అహంకారం కనిపిస్తోందని, కానీ అది ఏమాత్రం మంచిది కాదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారన్నారు. నిన్న రణస్థలంలో పవన్ సభ ద్వారా తాను ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారని వ్య...
యువశక్తి సభలో పవన్ కల్యాణ్ సీఎం జగన్, మంత్రి రోజా, ముఖ్య నేతలను వదలకుండా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యల మీద మంత్రులు రోజా, సిదిరి అప్పలరాజు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రోజాను డైమండ్ రాణి అంటూ కామెంట్ చేసిన పవన్ కల్యాణ్ మీద ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కౌంటర్ అటాక్ చేశారు. రెండుసార్లు గెలిచిన తాను.. రెండు చోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అని నిలదీశారు. ప్రజల కోసం తప్పడం లేదని కామెం...
రణస్థలంలో గురువారం నిర్వహించిన యువశక్తి సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి అడ్డంగా దొరికిపోయారనే చెప్పవచ్చు. టీడీపీతో పొత్తు పైన, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో భేటీకి సంబంధించి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం వంటి అంశాలు ఆయనకు రివర్స్ అయ్యాయి. పవన్ ప్రతి అంశాన్ని సూటిగా మాట్లాడుతారని జనసైనికులు చెప్పవచ్చు. కానీ రాజకీయాల్లో కొన్ని చెల్లుబాటు కావు. చిన్న తడబాటును కూడా విపక్షాలు అనుకూలంగా ...
సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. ఎన్నికలు దగ్గరపడిన చివరి మూడు నెలల్లో అంతా మారిపోతుందని నాని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీచేయాలనేది అధిష్టానం ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ది పక్కా ప్యాకేజీ రాజకీయమేనని అంబటి రాంబాబు శుక్రవారం నిప్పులు చెరిగారు. తాను సింగిల్‌గా వెళ్తే రాజకీయంగా వీరమరణమని తనకు కూడా అర్థమైందన్నారు. పోరాడే దమ్ములేక, విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు చెబుతుంటే దానిని భరించలేక ఇష్టారీతిన మాట్లాడటం ఏమిటన్నారు. అసలు పవన్ చేసిన పోరాటం ఏమిటన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి మీద కూడా పోరాటం చేశానని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్న...
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు ఉండాలంటే ఆ పార్టీ సరిగా ఉండాలని ఆయన అన్నారు. గౌరవం తగ్గకుండా ఉంటేనే పొత్తు ఉంటుందని, లేకపోతే ఒంటరి పోరాటమే అని పవన్ స్పష్టం చేసారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం అవసరం లేదని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను బాధ్యత త...
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని శివచరణ్ రెడ్డి నీడలా వెంటాడుతున్నాడు. నాన్నా.. నేను ఎవరినీ అని అడుగుతున్నారు. మమ్మల్ని ఎందుకు దూరం పెట్టావు.. 18 ఏళ్ల నుంచి రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నాడు. నీ ఆస్తి, నీ అంతస్తు, రాజకీయ వారసత్వం అవసరం లేదు. కానీ ఒక కొడుకుగా గుర్తించు అని దీనంగా అడుగుతున్నారు. లేదంటే డీఎన్ఏ టెస్ట్‌కు వెళదాం అంటూ సవాల్ విసురుతున్నాడు. శివచరణ్ రెడ్డి లేఖ వదిలినా, మర...