థియేటర్లో వీరసింహారెడ్డి ఊచకోతకు.. రికార్డులు బద్దలవుతున్నాయి. అఖండ బ్లాక్ బస్టర్.. అన్ స్టాపబుల్ టాక్ షో.. బాలయ్య క్రేజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఇలాంటి సమయంలో క్రాక్ బ్లాక్ బస్టర్‌తో జోష్ మీదున్న గోపీచంద్ మలినేని.. బాలయ్యతో వీరసింహారెడ్డి తెరకెక్కించాడు. దానికి తోడు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడం.. సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చింది. అందుకు తగ్గట్టే బాలయ్య కెరీర్లోనే అత్యధిక లొకేషన్లు, స్క్రీన్లలో వీరసింహారెడ్డి రిలీజ్ అయింది.
ఫస్ట్ డే ఫస్ట్ షో.. థియేటర్ల ముందు మాస్ జాతర జరిగింది. సంక్రాంతికి ఫస్ట్ రోరింగ్ బాలయ్యదే కావడంతో.. వీరసింహారెడ్డి భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మొత్తంగా 54 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్టు మైత్రీ మేకర్స్ ప్రకటించారు. దీంతో అఖండ తొలిరోజు రికార్డుతో పాటు.. బాలకృష్ణ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ భారీ వసూళ్లు వస్తున్నాయి. తమిళ్లో రిలీజ్ అయిన వారిసు, తునివు సినిమాలు కూడా బాలయ్యను క్రాస్ చేయలేకపోయాయి. ఈ రెండు సినిమాలు 30 కోట్ల ఓపెనింగ్స్ కూడా అందుకోలేదు. ఈ లెక్కన బాలయ్య హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాంతో ఊహించిన దానికంటే ముందే.. రెడ్డిగారు 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవడం ఖాయమంటున్నారు. ఏదేమైనా బాలయ్య ఒంటి చేత్తో ఊచకోత కోస్తున్నారని చెప్పొచ్చు.