ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికొక ఐటీ శాఖ మంత్రి ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ఆయన ఐటీ మంత్రి అయ్యాక ఏపీకి ఒక్క పరిశ్రమ వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను తిట్టడానికే అమర్ నాథ్ లాంటి వాళ్లు మంత్రులుగా అయ్యారని తెలిపారు. ఆయన తిట్టడానికి తప్ప పరిశ్రమలు తీసుకురావడానికి పనిక...
తిరుమల పుణ్యక్షేత్రంలో ఏరియల్ ఫుటేజీతో కూడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అదొక ఫేక్ వీడియో అని, తిరుమలలో డ్రోన్లకు అనుమతి లేదని వెల్లడించారు. తిరుమల ఎప్పుడూ సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంటుందని, శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేయడం అసాధ్యమని ఈవో తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో 3డీ ఇమేజీ లేదా గూగుల్ లైవ్ వీడియో అయ్యుంటుందని ఈవో ...
కళియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీవారిని కొలుస్తారు. తిరుమలలో డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం ఎప్పటినుంచో ఉంది. తాజాగా తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆలయ డ్రోన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://www.instagram.com/p/CnoiirOB1vW/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ని హైకోర్టు సస్పెండ్ చేయగా.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాజాగా సుప్రీం కోర్టు దీనిపై స్పందించింది. ఈ జీవో విషయంలో తాము జోక్యం చేసుకోమంటూ తేల్చి చెప్పింది. సుప్రీం నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. తప్పుడు నిర్ణయాలతో ప్రజాధనాన్ని ...
బీజేపీ సీనియర్ నేత పురుందేశ్వరి బీజేపీకి రాజీనామా చేశారా..? ఇది పుకారు కాదు… స్వయంగా… పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్లు చెప్పడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో.. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు చెప్పారు. దానిలో భాగంగానే.. ఓ సందర్భంలో పురందేశ్వ...
ఈసారి యూట్యూబ్ పగిలిపోవాల్సిందేనని.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు.. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, పవర్ గ్లాన్స్ చూసి.. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మ...
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ పోలీసులు మళ్లీ నోటిసులు పంపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆయన ఇంటికి వెళ్లి 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు విజయ్ నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో తల్లికి నోటీసులు అందించారు. ఈ నెల 27న మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ‘భారతి పే’ పేరిట పోస...
జనవరి నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 28న నాల్గో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఇక వారంలో ఐదు రోజుల పని, పెన్షన్ అప్డేషన్, నేషనల్ పెన్షన్ స్కీం రద్దు, జీతాల పెంపు, ఖాళీల భర్తీ డిమాండ్లతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ, జనసేన ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అధికారం చేజిక్కించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యుహాలు రచిస్తున్నారు. 2014 ఎన్నికల మాదిరిగా 2024లో అధికారం దక్కించుకోవాలని అనుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు జరుపుతున్నారు. పవన్ కూడా చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తిరిగి అధికారం చేపట్టాలంటే కాపు...
అంబేడ్కర్ స్మృతివనం త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనుల నిర్మాణ పురోగతిపై శుక్రవారం సీఎం అధికారులతో సమీక్షించారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న విగ్రహం, దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్చి నె...
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఎట్టకేలకు పుష్పరాజ్ సందడి మొదలైపోయింది. వైజాగ్‌లో పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ వాసులు అల్లు అర్జున్‌కి గ్రాండ్ వెల్క మ్ చెప్పారు. బన్నీని చూసేందుకు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు అభిమానులు. అల్లు అర్జున్‌ని చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దాంతో అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయాడు ఐకాన్ స్టార్. ప్రస్తుత...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు ప్రతిష్టాత్మక భారత రత్న అవార్డు వరించనుంది. సినీ నటుడిగా సమాజానికి, రాజకీయ వేత్తగా ప్రజలకు సేవ చేసినందుకు అవార్డు ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందట. ఈ అంశం గురించి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చర్చించారని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని చాలా రోజుల నుంచి టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరు...
నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను… కానీ రాజకీయం నా నుండి దూరం కాలేదు… ఇది చిరంజీవి ఇటీవలి సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్. ఏ ఉద్దేశ్యంతో ఆ సినిమాలో డైలాగ్ పెట్టారో కానీ నిజజీవితంలోను అదే కనిపిస్తోంది. ఆయన రాజకీయాల్లో ఫెయిల్యూర్ కావొచ్చు.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానులు కలిగిన నటుడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఏ పార్టీ అయినా ఆయన కోసం ఆశగా చూస్తుంటుందనడంలో ...
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా.. వారిపై విమర్శల వర్షం కురిపించారు. కమీషన్ల కోసమే కాఫర్ డ్యాం లేకుండా డయాఫ్రం వాల్ కట్టారని ఆరోపించారు. ప్రాజెక్టులకు డబ్బులు కేటాయించడం, వాటాలు కొట్టేయడం, దోపిడీలు చేయడం, దొడ్డిదారిన పదవులు చేపట్టడం మీకు, మీ కుమారుడికి అలవాటే అన్నారాయన. నేను మీకన్నా వంద రెట్లు నిజాయితీపరుడ్ని గుర్తుపెట్టుకో...
జీవో నెంబర్ 1 పైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్పులపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. రోడ్ల పైన సభలు, సమావేశాల నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఈ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిప...