ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఎట్టకేలకు పుష్పరాజ్ సందడి మొదలైపోయింది. వైజాగ్‌లో పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ వాసులు అల్లు అర్జున్‌కి గ్రాండ్ వెల్క మ్ చెప్పారు. బన్నీని చూసేందుకు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు అభిమానులు. అల్లు అర్జున్‌ని చుట్టుముట్టి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దాంతో అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయాడు ఐకాన్ స్టార్. ప్రస్తుతం అందుకు సబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పుష్ప2 క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 10 రోజుల పాటు విశాఖ పరిసర ప్రాంతాల్లో పుష్ప 2 మూవీ షూటింగ్ జరగనుంది. విశాఖ, అరకు లోయ, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో పుష్పరాజ్ రచ్చ చేయనున్నాడు. ఈ మూవీని సుకుమార్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇదే సమయంలో యూఏఈ గవర్నమెంట్ అల్లు అర్జున్‌కి గోల్డెన్ వీసా జారీ చేసింది. ఈ విషయాన్ని బన్నీనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ఈ సందర్భంగా.. దుబాయ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. అయితే యూఏఈలో ‘గోల్డోన్ వీసా’ పొందడం అంత ఈజీ కాదు. ఎంతో పాపులారిటీ ఉంటే గానీ.. గోల్డెన్ వీసా రాదు. భారతీయ నటుల్లో కొందరికి మాత్రమే ఇలాంటి గౌరవం దక్కింది. ఇప్పుడు బన్నీ కూడా అరుదైన గౌరవాన్ని అందుకున్నాడని చెప్పొచ్చు. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు.. ఇప్పటి నుంచి పుష్పరాజ్ టైం స్టార్ట్ అయిందని రచ్చ చేస్తున్నారు. మరి పుష్ప2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.