అంబేడ్కర్ స్మృతివనం త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనుల నిర్మాణ పురోగతిపై శుక్రవారం సీఎం అధికారులతో సమీక్షించారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మిస్తున్న విగ్రహం, దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మార్చి నెలాఖరు కల్లా విగ్రహ నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్న అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. జనవరి 31 కల్లా విగ్రహానికి సంబంధించి కాస్టింగ్ చేసిన భాగాలన్నీ తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయని వివరించారు. కన్వెన్షన్ సెంటర్‌ను అద్భుతంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. కారు, బస్ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నామని, రోడ్లను సుందరీకరిస్తామని తెలిపారు. అనంతరం సీఎం జగన్ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తిచేయాలని చెప్పారు. అత్యంత నాణ్యతతో, అందంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు. పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు మేరుగ నాగార్జున, బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, అధికారులు శ్రీలక్ష్మి, జయలక్ష్మి, ఢిల్లీరావు, సృజన పాల్గొన్నారు.
విగ్రహ ప్రత్యేకతలు
– విగ్రహ పీఠంతో కలుపుకుని మొత్తం పొడవు 206 అడుగులు
– అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.268 కోట్లు
– పీఠం భాగంలో జీ ప్లస్ టూ నిర్మాణం ఉంటుంది
– ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు
– 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడి వినియోగం
క్యాంపు కార్యాలయంలో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనుల పురోగతిపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష. శరవేగంగా ప్రాజెక్టు పూర్తిచేయాలని సీఎం ఆదేశం. pic.twitter.com/b9ko8Mqm7I