• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మార్కాపురం ఆర్డీవోగా ప్రభాకర్ నియామకం

ప్రకాశం: మార్కాపురం జిల్లా నూతన ఆర్డీవోగా ప్రభాకర్ నియమితులయ్యారు. ఈయన గుంటూరు జిల్లా నుంచి బదిలీపై రానున్నారు. ఇప్పటివరకు మార్కాపురం ఇన్చార్జి సబ్ కలెక్టర్‌గా పని చేసిన వెంకట శివరాంరెడ్డి వెలుగొండ ప్రాజెక్టుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా వెళ్లనున్నారు. అధికారుల ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఆర్డీవో బాధ్యతలు స్వీకరించనున్నారు.

February 25, 2026 / 10:50 AM IST

వరాహలక్ష్మీ స్వామి ఆలయంలోసహస్రనామార్చన

VSP: సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో బుధవారం సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.

February 25, 2026 / 10:43 AM IST

మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: జిల్లాలోని 15 ఏపీ మోడల్‌ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఐదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి మార్చి 31 వరకు apms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.125 ఫీజు చెల్లించాలని అధికారులు కోరారు.

February 25, 2026 / 10:40 AM IST

అకాల వర్షాలకు దెబ్బ తిన్న మొక్కజొన్న

PPM: అకాల వర్షం కారణంగా సాలూరు మండలం కొత్తవలస, మరిపల్లి, కందులపదం, కురుకుట్టి, మమడిపల్లి, తదితర రైతు సేవాకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో మొక్కజొన్న పంట నష్టానికి గురి అయిందని మండల వ్యవసాయ అధికారి శిరీష తెలిపారు. పై గ్రామాల్లో సుమారు 45 మంది రైతులకు సంబంధించి 60 ఎకరాల పంట అకాల వర్షానికి దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు.

February 25, 2026 / 10:38 AM IST

పారిశుధ్య కార్యాక్రమాన్ని పర్యవేక్షించిన ఈఓ

VZM: మెరకముడిదాం మండలం గర్భాంలో పంచాయతీ EO విశ్వనాథం పర్యవేక్షణలో బుధవారం పారిశుద్ధ్య కార్మికులు గ్రామంలో రోజువారి పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చెత్త కుప్పలను ఎత్తివేసి టాక్టర్‌ సహాయంతో డంపింగ్‌ యార్డ్‌కి తరలించారు. రోడ్లపై చెత్త వెయ్యరాదని పంచాయతీ వాహనాలు వచ్చినప్పుడు చెత్తని అందించాలని EO సూచించారు.

February 25, 2026 / 10:31 AM IST

కాటసాని రాంభూపాల్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్

KRNL: తనకు భద్రత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాటసాని రాంభూపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం పోలీసు భద్రతనేది హోదాగా మారిందని, దానికి ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు చేయాలని CJI ధర్మాసనం కాటసాని లాయర్ను ప్రశ్నించింది. శక్తిమంతులైన మీరు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

February 25, 2026 / 10:30 AM IST

ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపిన IDJN జిల్లా అధ్యక్షుడు

TPT: సూళ్లూరుపేట పట్టణంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త సబ్ ఇన్‌స్పెక్టర్‌ను IDJN తిరుపతి జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో శాంతి భద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తూ ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని కిరణ్ కుమార్ ఆకాంక్షించారు.

February 25, 2026 / 10:27 AM IST

గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కృష్ణా: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పులిగడ్డ గురుకులం(బాలురు)లో 5, 6వ తరగతుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేపట్టనున్నట్లు ప్రధానాచార్యులు కె. జాన్ వెల్లడించారు. దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తామని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు.

February 25, 2026 / 10:23 AM IST

పాఠశాలలకు సరఫరా చేస్తున్న చిక్కీలపై ఆరోపణలు

ASR: పోలవరం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు పంపిణీ చేస్తున్న చిక్కీల (పల్లీ అచ్చులు) నాణ్యతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రంపచోడవరం, చింతూరు డివిజన్లలోని పాఠశాలలకు అందుతున్న చిక్కీలలో పురుగులు కనిపిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

February 25, 2026 / 10:22 AM IST

కంబాలకొడం అభివృద్ధికి బృహత్ ప్రణాళిక

VSP: కంబాలకొండలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధికి బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. ఈఎస్ జెడ్ పరిధిలో 30.51 చ.కి.మీ. విస్తీర్ణానికి ముసాయిదా జోనల్ మాస్టర్ ప్లా రూపొందిస్తున్నారు. రహదారుల అనుసంధానం, భవిష్యత్ రహదారి మార్గాలు స్పష్టంగా చేర్చాలని సూచించారు.

February 25, 2026 / 10:21 AM IST

కుక్క దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు

ATP: గుత్తి కోటవీధిలోని ప్రాథమిక పాఠశాల వద్ద మహమ్మద్ అనే విద్యార్థిపై బుధవారం కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కోటవీదిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

February 25, 2026 / 10:20 AM IST

గాంధీ బొమ్మ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక గాంధీ బొమ్మ ప్రాంతంలో నుడా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న “ఐ లవ్ నెల్లూరు” బోర్డు ఏర్పాటు పనులను అధికారులతో కలిసి బుధవారం పర్యవేక్షించారు. అనంతరం స్థానిక మినీ బైపాస్ నర్సరీల సమీపంలో నూతనంగా భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ పనులను నుడా అధికారులతో కలిసి పరిశీలించారు.

February 25, 2026 / 10:20 AM IST

చెత్త సేకరణకు 3 పుష్ కార్ట్స్

AKP: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోటవురట్ల మండలంలో మూడు పంచాయతీలకు పుష్ కార్ట్స్‌తో పాటు తడి, పొడి, ప్రమాదకరమైన చెత్త సేకరణకు డస్ట్ బిన్‌లను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని కోటవురట్ల తంగేడు, టి. జగ్గంపేట పంచాయతీలకు కేటాయిస్తున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. వీటి ద్వారా చెత్త సేకరణ చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

February 25, 2026 / 10:19 AM IST

ట్యాంకు వద్ద మహిళ మృతి

PLD: రాజుపాలెం మండలం ఉప్పలపాడులో గ్రామంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. గ్రామంలోని నీటి ట్యాంకు సమీపంలో మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలు వేల్పుల మల్లేశ్వరి (45)గా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

February 25, 2026 / 10:15 AM IST

ప్రత్తిపాడులో పారిశుద్ధ్య కార్మికుల నిరసన

GNTR: ప్రత్తిపాడులో బకాయి పడ్డ జీతాల విషయంలో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు. పూర్తి జీతాలు ఇచ్చే వరకు పనిలోకి రావద్దని గతంలో చెప్పిన మేస్త్రి, ఇప్పుడు ట్రాక్టర్‌తో చెత్త ఎత్తించడంపై కార్మికులు మండిపడ్డారు. నిరసనగా చెత్త ట్రాక్టర్‌ను కదలకుండా అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు.

February 25, 2026 / 10:14 AM IST