• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ తర్వాత జగన్: ఏడ్చేసిన లక్ష్మీపార్వతి

దివంగత నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ 18 జనవరి 1996లో కన్నుమూశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు...

January 18, 2023 / 10:19 AM IST

అక్కడ గెలిస్తే టీడీపీదే ప్రభుత్వం, 25వేల మెజార్టీ ఖాయం: కేశినేని

నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఉన్నవాళ్లకు విజయవాడ వెస్ట్ టిక్కెట్ ఇస్తే గెలుపు తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ నేత, ఎంపీ కేశినేని నాని అన్నారు. పశ్చిమలో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఇక్కడ సరైన అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి 25వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వెస్ట్‌లో ఎవరికి పదవులు ఇవ్వాలనే విషయాన్ని తాను చెప్పలేదన్నారు. భవిష్యత్తులో అన్ని డివిజన్లలో టీడీపీలోకి చేరి...

January 17, 2023 / 05:43 PM IST

రోజా తగ్గేదేలే అంటారు, పవన్ కళ్యాణ్‌పై పోటీకి అలీ రెడీ!

వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమని ప్రముఖ సినీ నటుడు, ఆ పార్టీ నేత అలీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు పవన్ పైన పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. నవ్వుతూ… అది జగన్ అభిప్రాయం, మా ముఖ్యమంత్రి ఇక్కడి నుండి పోటీ చెయ్ అలీ అంటే నేను రెడీ అన్నారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు […]

January 17, 2023 / 03:16 PM IST

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌కు రోజా ఎందుకు వెళ్లడం లేదంటే?

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లడం చూశాక, తనకు వెళ్లాలనిపించలేదని ఏపీ మంత్రి రోజా అన్నారు. బాలయ్య బాబుతో తాను ఏడు సినిమాలు చేశానని, అవన్నీ హిట్ సినిమాలేనని, కానీ రాజకీయాల్లో ఆయన థియరీనే సరైనది కాదన్నారు. తన బావ కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తోందని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలు మృత్యువాత పడుతున్నా సభలకు అనుమతి ఇవ్వాలా అని ప్రశ్నించారు. తనకు అన...

January 17, 2023 / 12:46 PM IST

టీమిండియా సభ్యులతో కలిసి జూ.ఎన్టీఆర్ సందడి

టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ టీమిండియాతో కలిసి సందడి చేశారు. భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే 18వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం క్రికెటర్లు నగరానికి వచ్చారు. ఎన్టీఆర్ ఇటీవలె ఆర్ఆర్ఆర్ మూవీకి గాను గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అందుకొని, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఉమ్మడి మిత్రుడి ద్వారా క్రికెటర్లు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన...

January 17, 2023 / 12:40 PM IST

జగన్ వంటి దుష్టుడితో దోస్తీ వద్దు: కేసీఆర్‌కు రఘురామ

మంచివాడైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దుష్టుడైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో స్నేహం ఏమాత్రం మంచిది కాదని వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ప్రాంతీయతత్వాన్ని వదిలి, జాతీయ దృక్పథంతో ముందుకు సాగాలని పార్టీని టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్‌గా మార్చుకున్నారని, అలాంటి మహానాయకుడైన మీరు జగన్‌కు మద్దతుగా నిలువవద్దని కోరారు. రాష్ట్రంలోని ఓ వర్గం పవన్ కళ్...

January 17, 2023 / 10:32 AM IST

సోదరుడికి టిక్కెట్ ఇస్తే సహకరించను: కేశినేని నాని షాకింగ్

టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు కేశినేని శివనాథ్‌కు లోకసభ టిక్కెట్ ఇస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోను సహకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. అతనితో పాటు మరో ఇద్దరు, ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చినా మద్దతు ఇచ్చేది లేదన్నారు. ఎవరైనా పార్టీలో పని చేయవచ్చు… పోటీ కూడా చేయవచ్చునని, కానీ క్రిమినల్స్, ల్యాండ్, సెక్స్ మాఫియా గ్రూప్‌లకు టిక్కెట్లు ఇస్తే సహకరించే ప్రసక్తి లేదన...

January 17, 2023 / 08:30 AM IST

చంద్రబాబు భవిష్యత్తు ఎప్పుడో చిరిగిపోయింది: పెద్దిరెడ్డి

చంద్రబాబు కారుకూతలు కూస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా టీడీపీ జెండా పీకేయడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సోమవారం అన్నారు. పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి పని అయిపోయిందని, ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ప్రజలు తనకు బుద్ధి చెప్పడం కాదని,...

January 16, 2023 / 07:10 PM IST

కొండగట్టులో పవన్ కళ్యాణ్ వారాహికి పూజలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ప్రత్యేక బస్సు వారాహితో రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ వాహనం రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయింది. బస్సుకు 24వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారని, అనంతరం ఆలయ...

January 16, 2023 / 06:10 PM IST

నీ పనీ, నీ పార్టీ పని అయిపోయింది….జగన్ పై చంద్రబాబు కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.  వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పనీ, ఆ పార్టీ పని అయిపోయిందని  ఆయన అన్నారు. రొంపిచర్ల ఫ్లెక్సీ  వివాదంలో టీడీపీ శ్రేణుల పై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి పీలేరు సబ్ జైలు లో ఉంచారు. సోమవారం అన్నమయ్య జిల్లాకు వచ్చిన చంద్రబాబు సబ్ జైలులో ఉన్న [&hell...

January 16, 2023 / 05:43 PM IST

పవన్‌పై మైండ్‌గేమ్, వైసీపీకి భయం పట్టుకుందా?

2024లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు ఇటు బీజేపీకి, అటు టీడీపీకీ ఇష్టమే. ఎటొచ్చి టీడీపీ, బీజేపీ మధ్య పొసగడం లేదు. జనసేనాని మాత్రం ఆ రెండు పార్టీలకు కుదరని పక్షంలో టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి బీజేపీ క...

January 16, 2023 / 05:07 PM IST

సంబరాల రాంబాబు: పవన్, నాగబాబుతో డ్యాన్స్ చేయిస్తానని అంబటి

ఏపీ మంత్రి అంబటి రాంబాబు, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మరోసారి ట్విట్టర్ ఫైట్ జరిగింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ ప్రసంగంలో అంబటిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏమయ్యా సంబరాల రాంబాబు అంటూ ఎద్దేవా చేశారు. జనసేనాని ఈ మాటలు అన్న ఒకటి రెండు రోజులకే మంత్రికి సంబంధించిన డ్యాన్స్ వీడియో హల్‌చల్ అయింది. బోగి సందర్భంగా అంబటి డ్యాన్స్ చేశారు. టీషర్ట్ వేసుకొని...

January 16, 2023 / 02:31 PM IST

అమెరికాలో రాజమౌళి నమస్కార స్పీచ్, నెటిజన్లు ఫిదా

క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ సందర్భంగా టాలీవుడ్ జక్కన్న చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన విజయం వెనుక పలువురు మహిళలు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజెస్, బెస్ట్ సాంగ్.. రెండు అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. ఈ అవార్డులను నా జీవితంలోని మహిళలకు అందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం అంటూ తెల...

January 16, 2023 / 02:09 PM IST

భగవంతుడు నో చెప్పాడు: రాజకీయాలకు దగ్గుబాటి, కొడుకు గుడ్‌బై

తాము రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నామని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రకటించారు. బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వేదికపై ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. తనతో పాటు తన తనయుడు హితేష్ కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటాడని చెప్పారు. డబ్బుతో రాజకీయం కక్ష సాధింపులకు దిగడం వంటివి తమ కుటుంబానికి అలవాటు లేని విషయాలు అన్నారు. గతంలో చేసిన రాజకీయాలకు, నేటి రాజకీయాలకు ఏమాత్రం ప...

January 16, 2023 / 01:37 PM IST

ఆయన నాకు ఎక్కువ కాదు.. నాగబాబుపై వర్మ ..!

ఆయన నాకు ఎక్కువ కాదు.. నాగబాబుపై వర్మ ..! వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిత్యం తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ… సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతూ ఉంటారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా వాటి గురించి కూడా తన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ పై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. కాపులను.. కమ్మవారికి అమ్మేశారంటూ కులం పేరు తెచ్చి ఆయన [&he...

January 16, 2023 / 01:36 PM IST