దివంగత నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ 18 జనవరి 1996లో కన్నుమూశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తమ తమ ప్రాంతాల్లోని విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు.
నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ తనను విడిచిపోయి 26 ఏళ్లవుతోందని కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన చివరి క్షణాల్లో అనుభవించిన మానసిక క్షోభను, అవమానాలను నేను కళ్లార చూశానని తెలిపారు. రాజులా బతిగా మహరాజు ఎన్టీఆర్ అన్నారు. సినిమారంగంలో, రాజకీయరంగంలో ఎదురులేకుండా ఏలిన చక్రవర్తి అన్నారు. తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ముద్రవేసుకున్న ఆయన తెలుగువారు చాలామంది దేవుడుగా కొలుస్తారు.
ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రామరాజ్యంలా పాలించారన్నారు. దేశం ఆయనను ఆదర్సంగా తీసుకోవాలన్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ అలాగే పాలిస్తున్నారని కితాబిచ్చారు. జగన్ తనకు మంచి గౌరవం ఇస్తున్నారన్నారు. జగన్ పాలనలో ప్రజలు చల్లగా ఉన్నారని, ఎన్టీఆర్ తర్వాత అలాంటి పాలన చూస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్కు అందాలని కోరుతున్నానని తెలిపారు. ఎంతోమందికి ఆయన ఆసరాగా ఉన్నారన్నారు.