• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. డీమార్ట్, స్మార్ట్ మీటర్లు ఇనిస్టాలేషన్, ఎక్షమో, ఆక్వా ఎక్స్ పోర్టు తదితర సంస్థల్లో పని చేసేందుకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 18-32 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 08:53 AM IST

ఈ నెల 28 న మండల సర్వసభ్య సమావేశం

VZM: ఈ నెల 28న వంగర మండల పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశ జరగనుందని MPP ఉత్తరావెల్లి సురేశ్‌ ముఖర్జీ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక MPDO కార్యాలయంలో మాట్లాడుతూ… శనివారం ఉదయం 10:30 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుందన్నారు. అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సమగ్ర అభివృద్ధి నివేదికలతో రావాలని సూచించారు.

February 24, 2026 / 08:52 AM IST

రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

కడప: అంబేద్కర్ సర్కిల్ వద్ద సోమవారం రాత్రి చిన్నచౌక్ ఎస్సై రాజరాజేశ్వర రెడ్డి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చినా.. మోడిఫైడ్ సైలెన్సర్లు వాడినా.. వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు.

February 24, 2026 / 08:49 AM IST

28నే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ATP: జిల్లాలో మార్చి నెల పింఛన్లను ఈ నెల 28వ తేదీనే పంపిణీ చేయనున్నారు. మార్చి 1 ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే నగదు అందజేయాలని నిర్ణయించింది. జిల్లాలోని 2.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.123 కోట్లు పంపిణీ కానున్నాయి. ఆ రోజున అందుకోలేని వారు మార్చి 2న సచివాలయాల్లో తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

February 24, 2026 / 08:49 AM IST

పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరం, భీమడోలు నారాయణపురం జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గణపవరం సీఐ రజిని కుమార్ పర్యవేక్షణలో పోలీసులున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు పేర్కొన్నారు.

February 24, 2026 / 08:49 AM IST

జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

విశాఖ: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విశాఖలోని జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ప్రాంతాల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల పనితీరును ప్రశంసిస్తూ, అంకితభావంతో కొనసాగించాలని సూచించారు. వీధి దీపాల నిర్వహణ, వ్యర్థాల సేకరణను బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

February 24, 2026 / 08:48 AM IST

బాలికను మోసం చేసిన యువకుడి రిమాండ్

NTR: మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరుకి చెందిన హేమంత్ సాయి కొత్తపేటకు చెందిన ఓ బాలిక(16)ను మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. ఈ మేరకు ఈ నెల 19న కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.

February 24, 2026 / 08:48 AM IST

జిల్లాలో రబీకి సరిపడా యూరియా నిల్వలు

ప్రకాశం: జిల్లాలో రబీ 2025-26 సీజన్‌కు అన్నిపంటలకు అవసరమైన మేర యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. యూరియా 34,878 మెట్రిక్ టన్నుల ఎరువు పంపిణీ ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. రైతులు కొనుగోలు చేయు సమయంలో బస్తాపై ముద్రించిన MRP ధరలను చూసుకుని దాని ప్రకారం పైకం చెల్లించి డీలర్ నుంచి రసీదు పొందాలన్నారు.

February 24, 2026 / 08:46 AM IST

నన్నయ వీసీని కలిసిన పీవీఎన్ మాధవ్

EG: నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీని సోమవారం సాయంత్రం ఏపీ రాష్ట్ర BJP అధ్యక్షుడు పీ.వీ.ఎన్. మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీ సందర్శించిన ఆయన వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వీసీతో చర్చించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో చేపట్టిన ప్రగతి పనులను మాధవు వీసీ వివరించారు.

February 24, 2026 / 08:46 AM IST

జిల్లా మార్కెట్లో శనగల కొనుగోలు కేంద్రం

KRNL: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ సెక్రెటరీ జయలక్ష్మి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నాఫెడ్ సంస్థ మార్క్ ఫెడ్ నోడల్ ఏజెన్సీ ద్వారా శనగలు క్వింటా రూ.5,875 మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. ఈ-పంట నమోదు చేసుకున్న రైతులు దిగుబడులు అమ్ముకోవాలని సూచించారు.

February 24, 2026 / 08:45 AM IST

మహానందిలో ఆలయ ఉద్యోగి ఆత్మహత్య

NDL: మహానంది గ్రామంలో ఆలయ ఉద్యోగి చల్లగాలి లక్ష్మయ్య సోమవారం ఉరివేసుకుని మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలా?, అనారోగ్య సమస్యలా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

February 24, 2026 / 08:42 AM IST

మార్చి 13 నుంచి అఖిల భారత స్థాయి నాటికల పోటీలు

W.G: కళలు అంతరించిపోకుండా ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రజల మీద ఉందని, కళాపరిషత్ నాటికలు ప్రజలకు సందేశాలు ఇచ్చే విధంగా ఉండాలని ఎంపీ పాక సత్యనారాయణ అన్నారు. మార్చి 13 నుంచి 16 వరకు వీరవాసరం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటికల పోటీల పుస్తకాన్ని ఎంపీ పాక సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు సోమవారం కళాపరిషత్ ప్రాంగణంలో నిన్న ఆవిష్కరించారు.

February 24, 2026 / 08:41 AM IST

‘రైతులకు 10% నిధులు కేటాయించాలి’

NLR: రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక సీపీఐ, రైతు సంఘం నాయకులు కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 10% నిధులు కేటాయించాలని అలాగే రూ. 2 లక్షలు పంట రుణాలు రైతులకు ఇప్పించాలని తదితర డిమాండ్లు పొందుపరిచారు.

February 24, 2026 / 08:40 AM IST

మార్కాపురంలో మీకోసం కార్యక్రమం నిర్వహణ

మార్కాపురంలో డీఎస్పీ నాగరాజు, కనిగిరి DSP సాయి ఈశ్వర యశ్వంత్ పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.

February 24, 2026 / 08:40 AM IST

మొదటి రోజు పరీక్షలకు 748 మంది గైర్హాజరు

కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 08:38 AM IST